Narayana Bail: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల జీవితలతో ఆటలాడుకునే యాజమాన్యాల పని పట్టాలని ప్రభుత్వం భావించినా అది సాధ్యం కాలేదు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి చిత్తూరు తరలించి జడ్జి ముందు హాజరు పరిచినా సరైన వాదనలు లేక ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో కేసు కొలిక్కి రాకుండా పోయింది.

దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుజాత సహకరించకపోవడం వల్లే నారాయణకు బెయిల్ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం సదరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ న్యాయవాది అయి ఉండి కూడా ప్రభుత్వ కేసును వాదించడానికి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నారాయణపై పెట్టిన కేసులపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుజాత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
Also Read: Pawan Kalyan :తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ప్రకటన.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
పేపర్ లీకేజీ నారాయణ సంస్థల నుంచే జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. వైస్ ప్రిన్సిపాల్ సెల్ నుంచి పేపర్ లీకేజీ వాట్సాప్ వెళ్లినట్లు తేల్చారు. దీంతోనే ఆయనను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల అభ్యర్థనను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీరుతో ప్రభుత్వానికి నష్టమే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నారాయణకు బెయిల్ రావడంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహకారం కూడా ఉందన్న వాదనలు వస్తున్నాయి.

నారాయణపై మోపిన అభియోగాలపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహకరించి ఉంటే ఈ కేసులో శిక్ష ఖరారు అయ్యేదని చెబుతున్నారు. ఆమె నో చెప్పడంతో స్థానికంగా ఉన్న ఓ న్యాయవాదిని తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన అనుకున్న స్థాయిలో వానదలు వినిపించకపోవడంతోనే నారాయణ సేఫ్ గా బయటకు వచ్చినట్లు చెబుతున్నారు.
నారాయణ 2014లోనే విద్యాసంస్థల చైర్మన్ గా తప్పుకున్నారని ఆధారాలు చూపడంతో మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. నారాయణ సమర్పించిన ఆధారాలకు వ్యతిరేకంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుజాత హాజరై వాదిస్తే కేసు మరోలా ఉండేదని పలువురు చెబుతున్నారు. సుజాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే నారాయణ సులువుగా బయట పడినట్లు సమాచారం.
Also Read:Chandrababu Naidu: దూకుడు పెంచిన చంద్రబాబు.. ముందుగాను అభ్యర్థులు ఫిక్స్
[…] […]