Hari Hara Veera Mallu: భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..రెండేళ్ల క్రితం ప్రారంభం అయినా ఈ సినిమా కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇటీవలే రెండు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా గ్లిమ్స్ వీడియో కి మరియు మేకింగ్ వీడియో కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అంత బాగా సాగుతున్న సమయం లో ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో నిన్న జరిగిన ఒక్క ప్రచారం అభిమానులను ఆందోళనకు గురి అయ్యేలా చేసింది..అదేమిటి అంటే బడ్జెట్ సమస్యల కారణంగా హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ ఆగిపోయింది అని ప్రచారం జరిగింది..

అయితే ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చెయ్యగా, సోషల్ మీడియా లో బడ్జెట్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది అనే వార్త లో ఏ మాత్రం నిజం లేదు అని, ఈ సినిమాలో నటించాల్సిన ప్రధాన తారాగణం కి సంబంధించిన డేట్స్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం తో షెడ్యూల్ వాయిదా పడింది అని ఈ చిత్రానికి చెందిన యూనిట్ సభ్యులు సమాచారం అందించారు..

మరో పది రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది అని, జులై నెలాఖరు లోపు షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాని తెచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తుంది..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్స్ హైదరాబాద్ అల్లుమినియం లో వేసి ఉన్నారు..త్వరలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ మరియు ఇతర ప్రధాన తారాగణం మీద సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు క్రిష్..వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి వరుస రీమేక్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్నా డైరెక్ట్ సినిమా కావడం తో ఈ మూవీ పై కేవలం అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతమేరకు అందుకుంటుందో చూడాలి.
Also Read: Jr NTR Birthday Special: కామెంట్లతో ఎన్టీఆర్ కి నీరాజనాలు పలికిన అభిమానులు
[…] Also Read: Hari Hara Veera Mallu: ఆగిపోయిన పవన్ కళ్యాణ్ హరి హర … […]