Homeఎంటర్టైన్మెంట్Jr NTR Birthday Special: కామెంట్లతో ఎన్టీఆర్ కి నీరాజనాలు పలికిన అభిమానులు

Jr NTR Birthday Special: కామెంట్లతో ఎన్టీఆర్ కి నీరాజనాలు పలికిన అభిమానులు

Jr NTR Birthday Special: ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో ఎన్టీఆర్ కి నీరాజనాలు పలుకుతున్నారు. అభిమానులు పోస్ట్ చేస్తున్న మెసేజ్ ల్లో కొన్ని చాలా బాగున్నాయి. మరి ఎన్టీఆర్ పై అభిమానికి ఇవి ఒక నిదర్శనం. ఇంతకీ ఆ మెసేజ్ లు ఏమిటో మీరు కూడా ఒక లుక్కేయండి.

Jr NTR Birthday Special
Jr NTR

నీకోసం రాయాలంటే చెయ్యి
కదలదు…
రాయకుండా ఉందామంటే
మనసు ఊరుకోదు…
శక్తిగా మారిన వ్యక్తివి,
వ్యక్తిత్వంలో రారాజువి,
అన్నింటిలో తారకరాముడివి…
నిండు నూరేళ్ళు
సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
రామయ్యా!!… అంటూ ఓ అభిమాని పెట్టిన ఈ మెసేజ్ బాగా వైరల్ అవుతుంది.

Also Read: Bollywood Top Directors For NTR: ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ వీళ్ళే..!

నీకు మాస్ పలకాలంటే చేతిలో కత్తి అక్కర్లేదు.. వెనక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు.. 20 మంది రౌడీలను వెంటాడి వేటాడి నరక వలసిన అవసరం లేదు.. నీ కంటి చూపు చాలు అన్నా’ అంటూ మరో అభిమాని ఇలా మెసేజ్ చేశాడు. అలాగే మరికొందరు అభిమానులు ఎన్టీఆర్ పై ఎలాంటి మెసేజ్ లు పెట్టారో కింద లైన్స్ ను చూడండి.

రక్తంలో తడిసిన నేల ఒక్కటే గుర్తుకు వస్తుంది 🔥🔥. అతని నేల…అతని పాలన…కానీ ఖచ్చితంగా అతని రక్తం కాదు. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

నటన నీ నైపుణ్యం..నీ వాచకం భూషణం… నీ వ్యక్తిత్వం శిఖరం…నీ ఉనికి మాకు వరం…నిన్ను సూత్తే సంబరం…నువ్వు ఎదురుబడితే అదృష్టం.. నువ్వు కలహిస్తే కలవరం..నువు కలబడితే..విధ్వంస్వం…పేరు తారకరామ్..రూపు సకలగుణాభిరామం. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

Jr NTR Birthday Special:
Jr NTR

ఎన్టీఆర్ కి ప్రపంచ సినిమాని ఏలాడానికి సమయం వచ్చింది💥💥💥నీ చేతిలో కత్తే చెప్తుంది🗡️ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్స్ నీ🪓 నరకడానికి వస్తున్నావు అనీ.. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

నేడు నీబ్రతుకు ఒక ఎవరెస్టు శిఖరం
నీ మనసును దొంగలించిన అభిమాన వసంత వనం❤️🙏
కోట్ల మందిలో ఒకడివి
కోట్లమంది చేరుకోలేని స్థానంలో నేడు రేపు నువ్వొక్కడివే.☝️
NTR పుట్టుక నడవడిక ఇప్పుడ celebration కాదు ఒక vibration కళకు కొత్త inspiration.🙏☝️
ఏ భాష భావానికి దొరకని new quotation
Only 1 NTR హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

Also Read: Allu Arjun Rejected Story: అల్లు అర్జున్ వదిలేసిన కథ ఎన్టీఆర్ తో చేస్తున్న కొరటాల శివ

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version