Jagan Strategies: సంక్షేమ పాలనతో దేశవ్యాప్తంగా ఏపీ సీఎం జగన్ అభిమానాన్ని చురగొన్నారని వైసీపీ నేతలు గొప్పగా చెబుతుంటారు. ఏపీలో సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రకటనలు చేస్తుంటారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చెప్పలేం కానీ.. రాజ్యాంగం, చట్టం, న్యాయానికి సవాల్ విసిరి సక్సెస్ అయిన నేతగా జగన్ గుర్తింపు పొందారు. ఆయన క్రిమినాలజీకి కాకలు తీరిన నేతలు సైతం హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రత్యర్థులపై ఆయన విసురుతున్న పంజాను చూసి బెంబేలెత్తిపోతున్నారు. అటువంటి నాయకుడు మా రాష్ట్రంలో పుట్టకపోవడంతో అదృష్టంగా భావిస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఎంతలా పట్టు బిగిస్తున్నారో పరిణామాలు చూస్తుంటే తెలుస్తున్నాయి. చివరకు చట్టాలకు, రాజ్యాంగానికి ఎలా గంతలు కట్టారో కళ్ళముందే కనిపిస్తోంది. అయినా వ్యవస్థలను కళ్ళు తెరవనీయకుండా చేశారు. కళ్ళు ఎదురుగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కనిపిస్తున్నా.. అక్కడ శిక్షణ తీసుకున్న వారే లేరని సులువుగా చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన సర్టిఫికెట్లన్నీ దాచి పెట్టి మరి దబాయిస్తున్నారు. డబ్బులు మళ్లించారని.. ఒక్క ఆధారం లేకుండా వాదిస్తున్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే అరెస్టు చేయించారు.
అసలు రోడ్డే లేని ప్రాంతంలో.. రోడ్డు ప్రతిపాదనల్లో ఆయా చిత లబ్ధి చేకూర్చారని కేసులు పెడుతున్నారు. రివర్స్ లేని రోడ్డులో రింగురోడ్డు ఉందని.. ఆ ప్రతిపాదనలను కొందరికి అనుకూలంగా తయారు చేశారని చెబుతూ కేసుల మీద కేసులు పెడుతున్నారు. తమకు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తున్న వారందరిపైనా కేసులు పెట్టేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో బలమైన వ్యవస్థలను సైతం బలహీన పరుస్తున్నారు. అచేతనంగా మారుస్తున్నారు.
ఇటువంటి క్రిమినల్ మైండ్ తమ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వస్తే తమ పరిస్థితి ఏమిటని విపక్ష నేతలు వణికి పోతున్నారు. ఇంతకుముందు సీఎంగా పదవి చేపట్టిన వారు తల్లడిల్లి పోతున్నారు. విశాఖ రాజధానిగా ప్రకటించిన తర్వాత వైసీపీ నేతలు ఎన్నెన్నో నిర్మాణాలను తమకు అనువుగా మార్చుకున్నారు. ప్రభుత్వ భూములను రాజవంశీయుల హక్కులుగా మార్చుకొని కైంకర్యం చేశారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు కొండలనే కొల్లగొడుతున్నారు. అయితే తాజా జగన్ లెక్క చూస్తే.. ఆయనకు పదవి పోతే.. ఆయనతో పాటు వందలాది మంది జైలుకు వెళ్లే అవకాశం ఉంది. సొంత పార్టీ నేతల్లో సైతం అదే భయం వ్యక్తం అవుతోంది. క్రిమినాలజీ మైండ్ ఉన్న వారి వెంట నడిచినా, వారితో సహచర్యం చేసినా.. మూల్యం తప్పదని జగన్ రాజకీయం గుర్తెరిగిన సొంత పార్టీ సీనియర్లు సైతం పక్కకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.