Balakrishna- Chiranjeevi
Balakrishna- Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు. వీరి సినిమాలు దాదాపు పోటీ పడుతూ ఉంటాయి. 2023 ఏడాది సంక్రాంతిలోనూ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’లో రోజుల తేడాతో రిలీజ్ ఆకట్టుకున్నాయి. అయితే సినిమాల పరంగా వీరు పోటీ పడ్డా రియల్ లైఫ్ లో మాత్రం మంచి స్నేహితులు అని చెప్పవచ్చు. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘ఆహా’లో వచ్చి తన గురించి, బాలకృష్ణ స్నేహం గురించి వివరంగా చెప్పారు. ఇక సినిమా ఇండస్ట్రీలో వీరు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఓ సారి బాలకృష్ణ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ తన ఇంటిని వాడుకొమ్మని అవకాశం ఇచ్చాడట. ఇంతకీ బాలకృష్ణ ఏ సినిమాను చిరంజీవి ఇంట్లో చేశారు? ఆ విశేషాలేంటి?
నందమూరి ఎన్టీ రామారావు వారసత్వాన్ని పుచ్చుకున్న బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి పేరు నిలబెడుతూ స్టార్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు 107 సినిమాల్లో హీరోగా చేసిన బాలకృష్ణ ప్రస్తుతం 108 సినిమా మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ ఓల్డ్ మూవీ గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. తాను హీరోగా చేసి బ్లాక్ బస్టర్ అయిన ఓ మూవీని మెగాస్టార్ ఇంట్లో తీసిన విషయం చాలా ఏళ్ల తరువాత బయటపడింది.
బాలకృష్ణ కెరీర్ లో మోస్ట్ క్లాసికల్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’. ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాలకృష్ణకు 50వది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా 1990 ఏప్రిల్ 27న రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 45 కేంద్రాల్లో 100 రోజుల పాటు నడిచిన ఈ సినిమా యువ చిత్ర పతాకంపై కాట్రగడ్డ మురారి, కే.నరసింహానాయుడు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కుటుంబ పరంగానే కాకుండా మ్యూజికల్ గా బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాను ముందుగా 11మంది రచయితలు 18 నెలల పాటు చర్చలు జరిగి ఒక రూపుకు తీసుకొచ్చారు. ఆ తరువాత 1989లో మార్చి నెలలో షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో బాలకృష్ణ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా కోసం గ్యాప్ తీసుకున్నారు. దీంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తరువాత 1989 డిసెంబర్ 3న రీ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేసుకుంది.
ఇక ఈ సినిమాలో అత్తా మామల ఇంటిపక్కనే ఉన్నపాకలో హీరో ఉంటూ అత్తను టీజ్ చేయాల్సిన సీన్ ఉంటుంది. ఈ ప్రదేశం మొత్తం చిరంజీవికి చెందిన గెస్ట్ హౌస్. మెగాస్టార్ చెన్నైలో ఉండగా ఇక్కడ గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నారు. ఆ పక్కనే రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ ప్రదేశంలోనే నారినారినడుమ మురారి సినిమాను చిత్రీకరించారు. ఇక్కడ దాదాపు 90 శాతం షూటింగ్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. సినిమాలోని సన్నివేశాలకు తగ్గట్టుగీ ఈ ప్లేస్ ఉండడంతో ఇక్కడే షూటింగ్ నిర్వహించారు. ఈ విషయాన్ని మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి మాత్రమే తెలుసు. కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Why did balakrishna have to shoot this movie at chiranjeevis house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com