మళ్లీ భారత్ లోకి టిక్ టాక్?

సామాజిక మాధ్యమంలో టిక్ టాక్ సృష్టించిన ఘనత అంతా ఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వారి వరకు అందరిని ఆకర్షించింది. దీంతో యువతరం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. టిక్ టాక్ ను విపరీతంగా వాడారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మందిని అట్రాక్ చేసిన సామాజిక మాధ్యమమే టిక్ టాక్. చైనా నుంచి ఎదురైన యుద్ధంతో మన దేశంలో దాన్ని నిషేధించారు. దీంతో అది భారతీయులకు దూరమైంది. ఈ నేపథ్యంలో […]

Written By: Raghava Rao Gara, Updated On : July 6, 2021 5:56 pm
Follow us on

సామాజిక మాధ్యమంలో టిక్ టాక్ సృష్టించిన ఘనత అంతా ఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వారి వరకు అందరిని ఆకర్షించింది. దీంతో యువతరం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. టిక్ టాక్ ను విపరీతంగా వాడారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మందిని అట్రాక్ చేసిన సామాజిక మాధ్యమమే టిక్ టాక్. చైనా నుంచి ఎదురైన యుద్ధంతో మన దేశంలో దాన్ని నిషేధించారు.

దీంతో అది భారతీయులకు దూరమైంది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ పై మళ్లీ అందరిలో అలజడి రేగుతోంది. టిక్ టాక్ ను అమ్మాలని బైట్ డ్యాన్స్ సంస్థ నిర్ణయించింది. దీంతో దాన్ని కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు టిక్ టాక్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ యాప్ ను కొనుగోలు చేయాలని చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి.

అమెరికా నుంచి ఫ్యాషన్యాప్ గోట్ సింగపూర్ నుంచి ట్రావెల్ బుకింగ్ వెబ్ సైట్ వీగో తదితర కంపెనీలు రేసులో ఉన్నాయి. భారత్ లో సైతం ఒకటి కన్నా ఎక్కువ కంపెనీలే పోటీ పడుతున్నాయి. ఇండియా నుంచి ప్రస్తుతం వీడియో కంటెంట్ తో నెటిజన్లను ఆకర్షిస్తున్న ఓ కంపెనీతోపాటు షార్ట్ న్యూస్ అందించే మరో యాప్ ఒక ప్రముఖ న్యూస్ చానల్ ఓ ఫుడ్ అవుట్ లెట్ తోపాటు మొత్తం 12 కంపెనీలు రేసులో ఉన్నాయి.

టిక్ టాక్ చైనా కంపెనీది కావడంతో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వేరే కంపెనీ దీన్ని కొనుగోలు చేసినప్పుడు దేశం మారుతుంది. పేరు కూడా మారుతుంది. భారత ప్రభుత్వం దీన్ని అనుమతిస్తుందా? అన్నది తేలాలి. ఓకే అయితే మరోసారి టిక్ టాక్ వీడియోలు రచ్చ చేస్తాయని వేరే చెప్పనక్కరలేదు. దీంతో టిక్ టాక్ ను ఏ దేశం కొనుగోలు చేస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ కంపెనీని చేజిక్కించుకునే సందర్భంలో ఎవరి పరం కానుందో చూడాల్సిందే.