నిరసనలకూ ఓ హద్దు ఉంటుంది. వంట చేసుకొనే సిలిండర్ ఇంట్లో ఉండాలి.. కానీ చెరువులో పడితే ఏమవుతుంది.. విషపూరితం అవుతుంది. ఆ గ్యాస్ లీకైతే చెరువులో మొత్తం కలుషితం అవుతుంది… అందులో పొరపాటున మెషిన్లు, మనుషులు సిలిండర్లు తొక్కితే పెద్ద ప్రమాదమే.. ఇలా నిరసనల పేరుతో జాతీయ మహిళా సమాఖ్య సభ్యులు చేసిన నిరసన వివాదాస్పదమైంది.
ఈ నిరసనలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉంది. కానీ.. ఇలాంటి చర్యలు మాత్రం బాధ్యతారాహిత్యమని కేటీఆర్ సీరియస్ అయ్యారు.
దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ నుంచి గ్యాస్ సిలిండర్ ను చెరువులో పడేశారు.
ఇక అక్కడే ఉన్న మరికొందరు నిరసనకారులు మేమేం తక్కువ తిన్నామా? అని పెట్రోల్ రేట్లు భారీగా పెరగడానికి నిరసన తెలుపుతూ ఓ బైక్ ను చెరువులో పడేశారు.
ఈ రెండు ఫొటోలను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చెరువుల్లో ఇలాంటి వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యాసవరాలను ఇలా చెరువులో వేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటివి వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
హోంమంత్రి, డీజీపీలను ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. చెరువుల్లో బైక్స్, సిలిండర్లు వేయడం బాధ్యతారాహిత్యమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో విమర్శించారు.
https://twitter.com/KTRTRS/status/1412257751191875602?s=20