ఆంధ్రప్రదేశ్‌పవన్‌ బాగానే పరిణతి సాధించారే..! : అందుకే బీజేపీని ఇన్‌వాల్వ్‌ చేయడం లేదా..?

పవన్‌ బాగానే పరిణతి సాధించారే..! : అందుకే బీజేపీని ఇన్‌వాల్వ్‌ చేయడం లేదా..?

Somu-Veerraju-Pawan-Kalyan
ఒక రాష్ట్రాన్ని టార్గెట్‌ చేసిందంటే బీజేపీ ఆ రాష్ట్రంలో కొలువుదీరే వరకూ పంతం వీడదు. అంతేకాదు.. మిత్రపక్షాలను మేనేజ్‌ చేయడంలోనూ ఆ పార్టీకి సాటి మరెవరూ లేరు. ఒక్కసారి కశ్మీర్‌‌ నుంచి కన్యాకుమారి వరకూ చూస్తే తెలుస్తుంది. ఆ పార్టీతో మిత్రుత్వం పెట్టుకున్న పార్టీ బాగుపడినట్లుగా చరిత్రలో లేదు. లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకున్న పార్టీలే బాగుపడ్డాయి. అందుకే కాబోలు ఈ మధ్య ఒక్కో పార్టీ ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు.. పవన్ కల్యాణ్ ఆ పార్టీతో నేరుగా సంబంధాలు పెట్టుకున్నారు. అంతకుముందు చురుగ్గా ఉండే పవన్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక సైలెంట్ అయ్యారు. ఏదైనా చేస్తే కలిసే చేయాలనుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే బీజేపీ పవన్‌ను కట్టడి చేసి.. తమ కార్యక్రమాలు తాము చేసుకుంటోంది.ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేనను నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలకు ఎక్కడో తేడా కొడుతున్నట్లుగా అనిపించినట్లుగా సమాచారం. రూటు మార్చి మరీ.. ప్రస్తుతం రాజకీయంగా పవన్ దూకుడు చూపిస్తుండటమే దీనికి కారణమై ఉండొచ్చు.

Also Read: వ్యక్తిగత వైరాలకు వ్యవస్థలు బలి..ఆంధ్రా పరువు నడిబజారున!

పవన్ కల్యాణ్.. ఇటీవల బీజేపీని పట్టించుకోకుండా సొంత కార్యాచరణను నమ్ముకొని దానినే అమలు చేస్తున్నారు. ఏలూరు వింతవ్యాధి ఘటన నుంచి వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ పోరాటాలు, దీక్షలు చేశారు. ఎక్కడా బీజేపీని ఇన్వాల్వ్ చేయలేదు. దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులకు మద్దతు ఇచ్చిన అంశంలోనూ బీజేపీని కలుపుకొని పోలేదు.

Also Read: నిమ్మగడ్డ మరో బహిరంగ లేఖ.. ఈసారి వాళ్లు టార్గెట్

అయితే.. ఇందుకూ కారణం లేకపోలేదు. ఎందుకంటే.. మరికొద్ది రోజుల్లో తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడ తమ పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలని జనసేన భావిస్తోంది. అయితే.. జనసేన బలపర్చిన బీజేపీ నాయకుడిని గెలిపించండి అంటూ ఆ పార్టీ నేతలు ఏకపక్షంగా ప్రచారం ప్రారంభించేశారు. దీంతోనే బీజేపీ కుట్రల్ని పవన్ అర్థం చేసుకున్నారని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

వాస్తవానికి ఏపీలో బీజేపీతో పోల్చుకుంటే జనసేనకే కాస్త ఫాలోయింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న కారణంతో తామే గొప్ప అన్నట్లుగా బీజేపీ నేతలు చెలరేగిపోతున్నారు. సోము వీర్రాజు సీఎం అంటూ ప్రచారం చేసేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన పవన్.. తన పార్టీని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్‌లలో బిజీగా ఉన్నా సమస్యల విషయంలో తరచూ పర్యటించాలని.. పోరాడాలని నిర్ణయానికొచ్చారు. అందుకే.. ఎక్కడా బీజేపీని ఆయన ఇన్వాల్వ్ చేయాలనుకోవడం లేదట.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version