https://oktelugu.com/

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే..?

దేశంలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా ముగియడంతో గతంతో పోలిస్తే బంగారానికి డిమాండ్ తగ్గగా ధర కూడా భారీగా తగ్గుతుండటం గమనార్హం. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,300 రూపాయలు తగ్గి 50,500 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరం ధర ఏకంగా 1,200 రూపాయలు తగ్గి 46,300 రూపాయలుగా ఉంది. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 11, 2021 / 11:13 AM IST
    Follow us on

    దేశంలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా ముగియడంతో గతంతో పోలిస్తే బంగారానికి డిమాండ్ తగ్గగా ధర కూడా భారీగా తగ్గుతుండటం గమనార్హం. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,300 రూపాయలు తగ్గి 50,500 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరం ధర ఏకంగా 1,200 రూపాయలు తగ్గి 46,300 రూపాయలుగా ఉంది.

    Also Read: శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకునే వారికి షాక్

    కొత్తగా బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ఒకవైపు బంగారం ధర తగ్గుతుంటే అదే సమయంలో వెండి ధర సైతం భారీగా తగ్గడం గమనార్హం. వెండి ధర ఏకంగా 5,500 రూపాయలు తగ్గడంతో కిలో వెండి ధర 69,000 రూపాయలకు చేరింది. రోజురోజుకు డిమాండ్ తగ్గుతుండటం వల్లే వెండి ధర తగ్గుతున్నట్టు తెలుస్తోంది.

    Also Read: నష్ట పోయిన ధనం తిరిగి రావాలంటే శివుడికి ఈ నీటితో అభిషేకం చేయాల్సిందే..!

    ఒకవైపు దేశీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గుతుంటే అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధర పెరుగుతుండటం గమనార్హం. ఔన్స్ బంగారం ధర 0.35 శాతం పెరుగుదలతో 1841 డాలర్లుగా ఉండగా వెండి ధర 2.08 శాతం పెరిగి 25.14 డాలర్లుగా ఉంది. బంగారం, వెండి ధరలను వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. అయితే నిపుణులు ఈ ఏడాది పసిడి ధర భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కేంద్ర బ్యాంకుల దగ్గర ఉండే బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు, డిమాండ్, ఇతర అంశాలు బంగారం రేట్లను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం బంగారం ధర తగ్గుతున్నా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాబాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.