PM Modi: అగ్రరాజ్యానికి కోపం వస్తే చాలు ఒకప్పుడు ఇండియా ఇబ్బంది పడేది. అగ్రరాజ్యం ఇబ్బంది పడకుండా నడుచుకునేది. తన ఇబ్బంది పడినప్పటికీ అగ్రరాజ్యానికి ఏమీ కాకుండా చూసుకునేది. శ్వేత దేశం నుంచి అధ్యక్షుడు లేదా ఆ స్థాయి వ్యక్తులు వస్తే ఇండియాలో ఒక రకమైన వాతావరణం నెలకొనేది. అధ్యక్షుడి సేవలో తరించేందుకు మన దేశ వ్యవస్థలు పోటీపడేవి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి.. ఇతర మంత్రులు వంగి వంగి సలాం చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అగ్రరాజ్యం అంటే సులభంగా తీసుకునే స్థాయికి భారత్ వచ్చేసింది.
Also Read: సుగాలి ప్రీతి కేసులో ఏపీ సర్కార్ డేరింగ్ స్టెప్.. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా?
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అగ్రరాజ్యం విధివిధానాలలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వాణిజ్యం విషయంలో ట్రంప్ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత్ అంటే చాలు మండిపడుతున్నారు. టారిఫ్ ల శాతాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మొదట్లో అమెరికా తీసుకుంటున్న నిర్ణయం వల్ల మనదేశంలో ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తింది. అగ్రరాజ్యం విధిస్తున్న షరతులను భారత్ ఎలా తట్టుకుంటుంది అనే అనుమానం అందరిలోనూ మొదలైంది. అయినప్పటికీ భారత్ 7.8% వృద్ధిరేటును నమోదు చేయడం విశేషం. ఇదే విషయాన్ని సగర్వంగా భారత ప్రధాని ప్రపంచ వేదికల ముందు చెప్పడం గమనార్హం.. సెమికాన్ ఇండియా 2025 సదస్సులో భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారిపోయాయి. గ్లోబల్ పరంగా చూసుకుంటే ఒక రకమైన వాతావరణం ఉంది. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఉత్పత్తి కూడా పడిపోయింది. నిరుద్యోగం తారస్థాయికి చేరుకుంది. ఇలాంటి స్థితిలో భారత్ సూపర్ వృద్ధిరేటును నమోదు చేయడం గొప్ప విషయమని భారత ప్రధాని పేర్కొన్నారు. కొంతమంది విచ్ఛిన్నకారులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ భారత్ స్థిరంగా నిలబడిందని ప్రధానమంత్రి కొనియాడారు.
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మైక్రో ప్రాసెసర్ చిప్ లను తయారుచేసి భారతదేశం ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. భారతదేశం విక్రం 32 బిట్ ప్రాసెసర్, 4 చిప్స్ తయారు చేసింది. ఇది తొలి మైక్రో ప్రాసెసర్ చిప్.. దీనిని ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబ్ డెవలప్ చేసింది.. వాహక నౌకల్లో.. కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే విధంగా దీనిని రూపొందించారు. సెమీ కండక్టర్ ఎకో సిస్టం ను ఇది పెంపొందిస్తుంది.. అయితే దీనిని కేవలం 3.5 సంవత్సరాల వ్యవధిలోనే భారత్ రూపొందించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఇక మన దేశంలో ఐదు సెమీ కండక్టర్ల నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతోంది. దీనివల్ల టెక్నాలజీ మీద భారత్ మరింత గ్రిప్ సాధించనుంది. అగ్రరాజ్యం షరతులు విధించినప్పటికీ.. భారత్ ఏ మాత్రం భయపడలేదు. అంతే కాదు తన ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే మార్గాలను సుగమం చేసుకుంది. అందువల్లే మోడీలో ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అది భారతదేశాన్ని మరింత ఆర్థికంగా శక్తివంతంగా మార్చేందుకు సహకరిస్తోంది.