Sugali Preethi Case: కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలలో సుగాలి ప్రీతి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తనకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చారని ప్రీతి మాతృమూర్తి ఆరోపించారు. అంతేకాదు తన కూతురి వ్యవహారాన్ని ఎన్నికల్లో అస్త్రంగా వాడుకున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకం కాబట్టి వైసిపి అనుకూల మీడియా సుగాలి ప్రీతి తల్లికి విపరీతమైన కవరేజ్ ఇవ్వడం మొదలుపెట్టింది. వైసిపి నాయకులు కూడా ప్రీతి తల్లికి అనుకూలంగా మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే సుగాలి ప్రీతి కుటుంబానికి భరోసా కల్పించారని.. ఆమె కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారని గుర్తు చేయడం మొదలుపెట్టారు. ఇది రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో.. రోజుల వ్యవధిలోనే చంద్రబాబు గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: అసలు ఎవరు ఈ ఒమీ..ఓజాస్ గంభీర కంటే పవర్ ఫుల్ నా..? బ్యాక్ స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
సుగాలి ప్రీతి కేసును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలనే నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ కేసును పట్టించుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి ఇటీవల ఆరోపించారు. ఇదంతా కూడా రాజకీయంగా తీవ్రమైన చర్చకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు కోటను ప్రభుత్వం అప్పగించింది. గతంలో వైసిపి ప్రభుత్వం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించినప్పటికీ.. అనేక కారణాలవల్ల ముందుకు సాగలేదు. దీంతో దర్యాప్తు జరిగిన తీరు పట్ల ప్రీతి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును వాస్తవానికి వెలుగులోకి తీసుకొచ్చింది జనసేనానే. అప్పటినుంచి సుగాలి ప్రీతి తల్లికి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తనను పట్టించుకోకపోవడం పట్ల సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఈ వ్యవహారాల్లో పెద్ద వ్యక్తులు ఉండడంతో అప్పట్లో ఏపీలో తీవ్రమైన చర్చకు దారితీసింది. అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరును పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఎండగట్టారు. ఒక రకంగా ఉద్యమమే చేశారు. దీంతో సుగాలి ప్రీతి తల్లికి ప్రభుత్వం తరఫున భూమి.. ఇతర ప్రయోజనాలు లభించాయి. అయితే ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం నిందితులకు అండగా ఉండుకుంటూ వస్తోందని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా స్పందించింది. ఈ కేసు లో ఉన్న అనేక వివరాలను పరిశీలించిన ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది. దీంతో సుగాలి ప్రీతి తల్లి తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.