Homeజాతీయ వార్తలుIn Active Mode Money : లెక్కా పత్రం లేని అన్ని వేల కోట్లు బ్యాంకుల్లో...

In Active Mode Money : లెక్కా పత్రం లేని అన్ని వేల కోట్లు బ్యాంకుల్లో మూలిగిపోతున్నాయా? ఇండియా అప్పే తీర్చేయొచ్చేమో..

In Active Mode Money : చదువుతుంటే సినిమా గుర్తుకు వస్తోంది కదూ. కానీ పై ఉపోద్ఘాతం సినిమా గురించి కాదు. కాల్పానిక సాహిత్యం అంతకన్నా కాదు. మొత్తంగా బ్యాంకుల్లో ఉండిపోయిన డబ్బు.. ఎవరు తీసుకోవడానికి ముందుకు రాని డబ్బు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల కోట్లు ఉన్నాయి.. అవి సంవత్సరాలుగా అందులోనే మూలుగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం చాలామంది డబ్బులను పొదుపు చేసి మర్చిపోవడంతో అవన్నీ కూడా ఇన్ ఆక్టివ్ మోడ్ లోకి వెళ్లిపోతాయి. దీనినే బ్యాంకింగ్ పరిభాషలో నిర్వహణ లేని సొమ్ము అని పిలుస్తారు. అయితే క్లెయిమ్ చేయని డబ్బు కొన్ని వేల కోట్ల వరకు ఉంటుందట. ఆ డబ్బు సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, టర్మ్ డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పాలసీల్లో ఉందట. బ్యాంకు డిపాజిట్లలో 62,000 కోట్లు, స్టాక్స్ లో 25 వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో 35వేల కోట్లు, ఈపీఎఫ్ లో 48 వేల కోట్లు, ఇన్సూరెన్స్ లో 21,500 కోట్ల రూపాయల నగదు ఉందట. ఇదంతా కలిపి లక్ష కోట్లు పై మాటే ఉందట.. అయితే ఈ డబ్బును కేంద్రం తీసుకోవడానికి అవకాశం లేకపోవడంతో అలానే ఉంటున్నదట. నిబంధనలు అందుకు అంగీకరించకపోవడంతో ఆ డబ్బు చాలా సంవత్సరాలుగా ఇన్ యాక్టివ్ మోడ్ లో ఉంటున్నదట.

ఆ డబ్బును ఏం చేస్తారు

ఇన్ యాక్టివ్ మోడ్ లో ఉన్న డబ్బును ప్రభుత్వం తీసుకోవడానికి ఉండదు. నిబంధనలు కూడా అందుకు అంగీకరించవు. ఆ డబ్బును ఇతర మార్గాలకు మళ్లించే అవకాశం కూడా లేదు. ఆ డబ్బును ఏం చేస్తారనేది ఇప్పటివరకు తెలియదు. అయితే ఈ డబ్బు కనుక ప్రభుత్వం చేతికి వస్తే చాలావరకు అప్పు తీరుతుంది.. ప్రస్తుతం మన దేశపు అప్పు లక్షల కోట్లను దాటింది. ప్రభుత్వాలు పంచుట పథకాలకు పన్నులను మళ్లిస్తున్న నేపథ్యంలో కీలక రంగాలకు కేటాయింపులు లేకుండా పోయాయి. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు తేవాల్సి వస్తోంది. ఆ అప్పులను దీర్ఘకాలిక వడ్డీ కింద చేర్చి.. ప్రతి ఏడాది కిస్తీల మాదిరిగా చెల్లించాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వానికి గనక ఇలా మూలుగుతున్న డబ్బు చేరితే అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టవచ్చు. లేదా దేశం తెచ్చిన అప్పును కొంతలో కొంత తీర్చవచ్చు.. దానివల్ల ప్రభుత్వాలకు పన్నులు పెంచే అవకాశం ఉండదు. ధరలను పెంచే అవకాశం ఉండదు. పైగా పన్నులను తగ్గించవచ్చు. ధరల స్థిరీకరణ పై కూడా సమగ్రమైన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఈ డబ్బు కొన్ని సంవత్సరాలుగా అలానే ఆయా విభాగాలలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ డబ్బు గనుక ప్రభుత్వం తీసుకోవాలి అనుకుంటే నిబంధనలను సరళతరం చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇంత డబ్బు మూలుగుతున్న విషయం బయటకి తెలియడంతో జనాల్లో విస్తృతమైన చర్చ మొదలైంది.. ఆ డబ్బును బయటికి తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తే దేశం బాగుపడుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular