Vallabhaneni Vamsi : గన్నవరం( Gannavaram) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరో షాక్ తగిలింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని.. కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని వచ్చిన ఫిర్యాదు పై ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు 14 రోజులపాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీ ప్రత్యామ్నాయం వైపు ఆలోచించుకోవాల్సి వచ్చింది.
* అప్పట్లో కేసు నమోదు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం కార్యాలయం పై దాడి జరిగింది. ఎమ్మెల్యే వంశీ ప్రోత్సాహంతోనే దాడి జరిగినట్లు పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు. టిడిపి ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్య వర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు పై వంశీ తో పాటు 88 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణ తుది దశకు వస్తున్న తరుణంలో హఠాత్తుగా ఫిర్యాదుదారుడు తీసుకున్నాడు. తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటూ ఏకంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
* అనుచరుల బెదిరింపులతో
అయితే వల్లభనేని వంశీ ( Vallabhaneni Vamsi Mohan ) అనుచరులు బెదిరింపులకు పాల్పడడం వల్లే సత్య వర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాదులోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లు కూడా గుర్తించారు. దీంతో ముందుగా వంశీ అనుచరులను అరెస్టు చేశారు. అటు తరువాత వంశీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే పోలీసులు అరెస్టు చేయక మునుపే వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. మరోవైపు తనకు జైల్లో అదనపు వసూలు కావాలంటూ దాఖలు చేసిన మరో పిటిషన్ పై విజయవాడ అట్రాసిటీ కోర్టు ఈరోజు విచారణ జరపనుంది.
* ఇప్పట్లో బయటపడే ఛాన్స్ లేదు
అయితే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు( jail) నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదని ప్రచారం నడుస్తోంది. ఆయనపై 18కి పైగా కేసులు నమోదు చేసినట్లు టాక్ నడుస్తోంది. బలమైన సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారని.. ఇక్కడ నుంచి వంశీ చుట్టు వరుస కేసులు తిరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై తరచూ విమర్శలు చేసేవారు. వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెంటాడుతోందని వైసిపి అనుమానిస్తోంది.
* సీరియస్ గా తీసుకున్న జగన్
మరోవైపు వల్లభనేని వంశి అరెస్టును సీరియస్ గా తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) వల్లభనేని వంశీని పరామర్శించారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పు చేస్తున్న కూటమి నేతలతో పాటు తప్పులను సమర్థిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎల్లకాలం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. వంశీకి అండగా న్యాయపోరాటం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కోర్టు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పడం విశేషం.