https://oktelugu.com/

భారత ఆర్థిక వ్యవస్థ నిలబడేది ఎప్పుడు?

కరోనా లాక్ డౌన్ తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ నిలబడేది ఎప్పుడు అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజలను, పారిశ్రామికవేత్తలను , ఆర్థికవేత్తలను వేధిస్తోంది.  లాక్‌డౌన్‌తో ఉద్యోగ ఉపాధి కోల్పోయింది. అందరూ రోడ్డునపడ్డారు.  పరిశ్రమలు మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆదాయ వనరులన్నీ మూసుకుపోయాయి. అటు రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. కొద్ది నెలలుగా అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తుండడంతో ఇప్పుడిప్పుడు ఆర్థిక వ్యవస్థ కుదులటపడుతోంది.. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌‌ కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 11:49 am
    Follow us on

    Indian economy

    కరోనా లాక్ డౌన్ తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ నిలబడేది ఎప్పుడు అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజలను, పారిశ్రామికవేత్తలను , ఆర్థికవేత్తలను వేధిస్తోంది.  లాక్‌డౌన్‌తో ఉద్యోగ ఉపాధి కోల్పోయింది. అందరూ రోడ్డునపడ్డారు.  పరిశ్రమలు మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆదాయ వనరులన్నీ మూసుకుపోయాయి. అటు రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. కొద్ది నెలలుగా అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తుండడంతో ఇప్పుడిప్పుడు ఆర్థిక వ్యవస్థ కుదులటపడుతోంది.. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌‌ కూడా ఓ తీపి కబురు చెప్పుకొచ్చారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలపైనా కరోనా పెను ప్రభావం చూపిందని దినేష్ అన్నారు. ఈ రంగాలు క్రమంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా 2020–-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు, వాహనాల సేల్స్ వంటివి పెద్ద ఎత్తున పెరిగాయి. రికవరీలో వేగం కనిపిస్తోంది. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడే అవకాశాలు కనిపిస్తున్నాయని అర్థమవుతోంది.

    Also Read: జోబైడెన్‌తో భారత్‌ లాభమా..? నష్టమా..?

    మరోవైపు.. రుణాల పట్ల కార్పొరేట్ రంగం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని దినేష్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరి నుంచి కొంత మేర సానుకూల సంకేతాలు కన్పించడమే కాకుండా.. ప్రస్తుత పతనం నుంచి వృద్ధి బాటలోకి పయనిస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలైన స్టీల్, సిమెంట్ వంటి విభాగాలు ఏప్రిల్ నుంచి ప్రోత్సాహకర పనితీరును కనబరచటమే కాకుండా ఎగుమతుల మార్కెట్‌ను పెంచుకున్నాయన్నారు. మున్ముందు ఇతర రంగాలు కూడా వృద్ధి బాటలో సాగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు.

    కరోనా సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదని.. ముఖ్యంగా ఆర్థిక సంస్థలు ఖర్చులను అదుపు చేయడం నేర్చుకున్నాయని తెలిపారు. ఈ మార్పులు చాలావరకు శాశ్వతంగా కొనసాగి ఆర్థిక వ్యవస్థ మరింత పరిణితి చెందేందుకు దోహదం చేస్తుందన్నారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడంలో ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును ప్రదర్శించిందన్నారు. జూన్ చివరి నుండి కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. కార్పొరేట్ రంగం నుంచి పెట్టుబడులకు డిమాండ్ పెరిగేందుకు కొంత సమయం పట్టవచ్చునని తెలిపారు.

    Also Read: అప్పుల కుప్ప.. అదే తెలంగాణ గొప్ప..

    కరోనా మహమ్మారి కారణంగా పతనమైన భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేగం పుంజుకుంటుందని దినేష్ కుమార్ కారా వెల్లడించారు. బెంగాల్ చాంపర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వర్చువల్ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 2021 నుండి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితులతో కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చునని, మరికొన్ని శాశ్వతంగా ఉంటాయన్నారు.