https://oktelugu.com/

Yo Yo Dieting: యో యో డైటింగ్ గురించి తెలుసా? దీనివల్ల ప్రయోజనం ఏంటి?

లావుగా కాకుండా అందంగా ఫిట్‌గా ఉండాలని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే ఇలాంటి డైట్‌లు ఫాలో అవుతుంటారు. ఇంతకీ ఈ యో యో డైటింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ డైటింగ్ వల్ల బరువు తగ్గుతారా? లేకపోతే పెరుగుతారా? అనే పూర్తి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2024 / 12:02 AM IST

    Yo Yo Dieting

    Follow us on

    Yo Dieting: అందంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉండాలని చాలామంది అమ్మాయిలు భావిస్తారు. కాస్త లావుగా ఉన్నాసరే బరువు ఎక్కువ ఉన్నామని ఫీల్ అయ్యి డైటింగ్ చేస్తుంటారు. బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొత్త కొత్త డైట్‌లు ఫాలో అవుతుంటారు. మార్కెట్లో ఏవైనా కొత్త డైటింగ్‌లు వస్తే మాత్రం వాటినే ఫాలో అవుతుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉండటంతో పాటు ప్రతీదీ కొన్ని క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా సోషల్ మీడియాలో చూసి ఫాలో అయ్యే డైట్‌లో యో యో డైటింగ్ ఒకటి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవుతుంది. బరువు ఉన్నవారు తప్పకుండా ఇలాంటి కొత్త డైట్‌లను ఫాలో అవుతుంటారు. ఎందుకంటే లావుగా కాకుండా అందంగా ఫిట్‌గా ఉండాలని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే ఇలాంటి డైట్‌లు ఫాలో అవుతుంటారు. ఇంతకీ ఈ యో యో డైటింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ డైటింగ్ వల్ల బరువు తగ్గుతారా? లేకపోతే పెరుగుతారా? అనే పూర్తి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలో చూద్దాం.

    ఈ రోజుల్లో సోషల్ మీడియాలో యో యో డైటింగ్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఈ డైటింగ్ ఫాలో కావడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని వీటిని ఫాలో అవుతారు. అయితే బరువు తగ్గేందుకు ఈ యో యో డైటింగ్ ఒకటి ట్రెండ్ అవుతుంది. అయితే ఈ డైటింగ్ చేసిన రోజులు బరువు తగ్గుతారు. ఎప్పుడు అయితే ఈ డైటింగ్ ఆపేస్తారో.. అప్పుడు మళ్లీ బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. అయితే ఈ యో యో డైటింగ్‌లో తక్కువ కేలరీల ఉండే ఆహారం తీసుకుంటారు. దీనివల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అయితే ఈ డైటింగ్ చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆ డైటింగ్ చేసి ఆపేసిన తర్వాత ఈజీగా బరువు పెరుగుతారు. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఏదైనా కొత్త డైటింగ్ ట్రెండ్ అవుతుంటే వాటిని చేయడం కరెక్ట్ కాదు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న కూడా తప్పకుండా వైద్యుల పర్మిషన్‌తోనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

    మార్కెట్లో ఇలాంటి కొత్త కొత్త డైటింగ్‌లు చాలానే వస్తాయి. వీటిన్నింటిని పాటిస్తే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న యో యో డైటింగ్‌ను ఫాలో అయితే మాత్రం అది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా బరువు తగ్గడం వల్ల మానసికంగా వేదన చెందుతారు. ఆ తర్వాత అది ఒత్తిడిగా మారుతుంది. దీంతో ఆహార అలవాట్లలో మార్పులు వచ్చి బులీమియా లేదా అనోరెక్సియా వంటి అనేక రుగ్మతల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత ఇలా ఒక్కసారిగా ఊబకాయం బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ప్రతీ డైటింగ్‌ను ఫాలో కావద్దు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.