ఇండియాలో గత మూడు వారాలుగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 31,216 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా 2,109 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు గణాంకాలు బెబుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 7,057 కేసులు నమోదు కాగా 609 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్ లో 5,418 కేసులు నమోదు కాగా 323 మంది మరణించారు. 2,976 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉంది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిన్-బి ఔషధం కొరత వల్లే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.