https://oktelugu.com/

కేసీఆర్ ఓ తరానికి నష్టం చేశాడా?

తెలంగాణ ఉద్యమం పతాక స్తాయికి చేరింది 2009 నుంచి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం.. ఆ తర్వాత కేసీఆర్ ఆమరణ దీక్ష.. నాటి సీఎం రోశయ్య ఫెయిల్.. ఉద్యమం ఉధృతం.. ఇలా సవాలక్ష సమస్యలతో పదేళ్లు సాగిన తెలంగాణ ఉద్యమం చివరికి లక్ష్యాన్ని సాధించింది. రాష్ట్రం సిద్ధించింది. కానీ యువత, ఉద్యోగులు, ప్రజలు ఈ పదేళ్లు తెలంగాణ కోసం కొట్లాడి తమ భవిష్యత్ ను ఉద్యోగాలను కోల్పోయారు. తెలంగాణ వచ్చాక కూడా జోన్లు, జిల్లాల విభజన సమస్యలతో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2021 6:18 pm
    Follow us on

    తెలంగాణ ఉద్యమం పతాక స్తాయికి చేరింది 2009 నుంచి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం.. ఆ తర్వాత కేసీఆర్ ఆమరణ దీక్ష.. నాటి సీఎం రోశయ్య ఫెయిల్.. ఉద్యమం ఉధృతం.. ఇలా సవాలక్ష సమస్యలతో పదేళ్లు సాగిన తెలంగాణ ఉద్యమం చివరికి లక్ష్యాన్ని సాధించింది. రాష్ట్రం సిద్ధించింది. కానీ యువత, ఉద్యోగులు, ప్రజలు ఈ పదేళ్లు తెలంగాణ కోసం కొట్లాడి తమ భవిష్యత్ ను ఉద్యోగాలను కోల్పోయారు. తెలంగాణ వచ్చాక కూడా జోన్లు, జిల్లాల విభజన సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ జరగలేదు. దీంతో నియామకాల్లేక ఒక తరం నష్టపోయిన వాస్తవం తెలంగాణలో ఉంది.

    తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అనేది ఇక్కడి నిరుద్యోగులకు చిరకాల వాంఛ. తెలంగాణ ఉద్యమం సాగించే ‘నిధులు, నీళ్లు, నియామకాల’ గురించి.. ఇప్పటి సీఎం.. నాటి ఉద్యమ సేనాని కేసీఆర్ సైతం వీటికోసం పోరాడారు. కానీ గద్దెనెక్కాక అసలు నిరుద్యోగులను, ఉద్యోగాలను పట్టించుకోవడమే మానేశారన్న విమర్శలు కొనితెచ్చుకున్నాడు.

    తాజాగా ఇదే పాయింట్ పై తెలంగాణలో అటు షర్మిల మొదటగా లేవనెత్తి నిరుద్యోగుల కోసం పోరాడుతోంది. ఇక తాజాగా ఈ అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టారు. ఏడేళ్లుగా తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కరోనా ఒకవైపు.. కేసీఆర్ మరో వైపు కలిసి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారం పోతేనే అన్ని సమస్యలు పోతాయన్నారు.

    ఇలా ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించారు. ఇప్పటికే షర్మిల ఓ వైపు టైట్ చేస్తుండగా.. మరోవైపు రేవంత్ తగులుకుంటున్నారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగాలను ఇవ్వక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. నిరుద్యోగులను చల్లార్చే కార్యక్రమాలు కేసీఆర్ చేస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి.