ఆ విలన్ దానం విలువ కొన్ని వందల కోట్లు !

‘తెలుగు సినీ పరిశ్రమ’ మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చిన రోజులు అవి. ప్రభుత్వం అగ్రనటులందరికీ అలాగే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. సినీ ప్రముఖులందరూ ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యారు. కానీ, చిన్న చితకా పనులు చేస్తూ పొట్ట నింపుకునే చిన్న టెక్నీషియన్స్ ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అప్పట్లో వేలమంది సినీ కార్మికులకు సరైన ఇల్లులు లేక రోడ్డు మీద గుడిసెలు వేసుకుని బతికే పరిస్థితి. వారి బాధలను ఇబ్బందులను సినీ నటుడు […]

Written By: admin, Updated On : June 30, 2021 6:20 pm
Follow us on

‘తెలుగు సినీ పరిశ్రమ’ మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చిన రోజులు అవి. ప్రభుత్వం అగ్రనటులందరికీ అలాగే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. సినీ ప్రముఖులందరూ ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యారు. కానీ, చిన్న చితకా పనులు చేస్తూ పొట్ట నింపుకునే చిన్న టెక్నీషియన్స్ ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అప్పట్లో వేలమంది సినీ కార్మికులకు సరైన ఇల్లులు లేక రోడ్డు మీద గుడిసెలు వేసుకుని బతికే పరిస్థితి.

వారి బాధలను ఇబ్బందులను సినీ నటుడు స్వర్గీయ ప్రభాకర్ రెడ్డి మాత్రమే అర్ధం చేసుకున్నారు. సినిమా కార్మికులకు ఇళ్లు ఉండాలి, వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అని స్థలం కోసం ప్రభుత్వం పై చిన్నపాటి పోరాటమే చేసిన ఏకైక సినీ ప్రముఖుడు కూడా ప్రభాకర్ రెడ్డినే. ఈ రోజు చిత్రపురి కాలనీ అంటే సినీ కార్మికులకు గొప్ప వరం. మరి ఆ భూమి ప్రభాకర్ రెడ్డి కష్టార్జితమే అని ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.

పేద కళాకారుల కోసం ప్రభాకర్ రెడ్డి చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిది. సినీ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోలేదని, తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కూడా ప్రభాకర్ రెడ్డి నిరాకరించారు. ట్విన్ సి అనే క్లబ్ ఏర్పాటు చేసి నిత్యం 300 మంది పేద కళాకారులకు భోజనం పెట్టారు. అలాగే వాళ్ల హెల్త్ కేర్ ని కూడా ప్రభాకర్ రెడ్డినే చూసుకునే వారు.

పైగా వృద్ధ కళాకారుల కోసం 500 రూపాయల పెన్షన్ ని తీసుకొచ్చింది కూడా ప్రభాకర్ రెడ్డినే. అన్నిటికీ మించి తన కష్టార్జితం అయిన పదెకరాల భూమిని కూడా చిత్రపురి కాలనీ కోసమే ఆయన ఇచ్చారంటే.. ప్రభాకర్ రెడ్డి గొప్పతనం విలువ కట్టలేనిది. ఆయన దానం ఇచ్చిన భూమి ఖరీదు కొన్ని వందల కోట్లు ఉంటుంది. అది ప్రభాకర్ రెడ్డి అంటే!!

ఇక చాలా మందికి ప్రభాకర్ రెడ్డి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుసు. అప్పటి విలన్ గా నేటి తరానికి కూడా ఆయన పరిచయమే. కానీ, ప్రభాకర్ రెడ్డి రియల్ హీరో. పైగా ఆయన నటుడు మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ కూడా, అలాగే రైటర్‌ కూడా. అన్నిటికీ మించి ఆ రోజుల్లోనే ఆయన మెడిసిన్ చదివారు.