https://oktelugu.com/

నేటి నుంచే తుంగభద్ర పుష్కరాలు.. క్షేత్రాలు, ఏర్పాట్లు ఇవీ!

తుంగభద్ర పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పవిత్ర పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప పుణ్య గడియలు మొదలవుతాయని పండితులు చెప్పారు. కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఆలంపూర్ వద్ద మధ్యాహ్నం 1.23 గంటలకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్యే అబ్రహం పుష్కరాలను ప్రారంభిస్తున్నారు. Also Read: టీడీపీని బలహీనపరిస్తే జగన్ […]

Written By: , Updated On : November 20, 2020 / 11:06 AM IST
Follow us on

Tungabhadra Pushkaralu

తుంగభద్ర పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పవిత్ర పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప పుణ్య గడియలు మొదలవుతాయని పండితులు చెప్పారు. కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఆలంపూర్ వద్ద మధ్యాహ్నం 1.23 గంటలకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్యే అబ్రహం పుష్కరాలను ప్రారంభిస్తున్నారు.

Also Read: టీడీపీని బలహీనపరిస్తే జగన్ కే దెబ్బనా?

పుష్కరాల ప్రారంభానికి శుక్రవారం ఉదయం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి కారులో తుంగభద్ర నది వరకు వెళ్తారు. పుష్కరాలు ప్రారంభించిన తర్వాత తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. 12 ఏళ్లకోసారి 12 రోజులపాటు జరిగే పుష్కరాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈసారి కోవిడ్ 19 నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులను పుష్కర స్నానానికి అనుమతిస్తారు. ఆ తర్వాత పుష్కర ఘాట్‌లోకి అనుమతించరు. పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు పుష్కరాలకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తుతో పాటు… పుష్కర ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

తుంగ, భద్ర అనే రెండు నదుల కలయికనే తుంగభద్ర. కర్ణాటకలో పుట్టిన తుంగభద్ర.. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాల మీదుగా ప్రవహిస్తోంది. కర్ణాటక నుంచి కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం కుటుకనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. చివరగా సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ ఏడాది వర్షాపాతం అధికంగా నమోదు కావడంతో తుంగభద్ర జలకళతో కళకళలాడుతోంది.

Also Read: జర్నలిస్టులకు.. కేసీఆర్ మళ్లీ వేసేశాడు..

ఇక ఏపీలోని కర్నూల్‌ జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద తాత్కాలిక బస్‌ షెల్టర్‌లను ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పుష్కర స్నానాలను ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణలోని గద్వాల జిల్లాలో నాలుగు ఘాట్లను ప్రభుత్వం పుష్కరాలకు సిద్ధం చేసింది. వేణిసోంపురం ఘాట్‌,రాజోళి ఘాట్‌, పుల్లూరు ఘాట్‌, అలంపూర్‌ ఘాట్‌లను భక్తులను సందర్శించవచ్చు. ఇక్కడ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను అనుమతిస్తారు. కోవిడ్‌ నేపథ్యంలో పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, 65 ఏండ్ల పైబడిన వారికి అనుమతి లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్