Homeజాతీయ వార్తలుPM Kisan: పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు పడుతాయి.. ప్రతీ...

PM Kisan: పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు పడుతాయి.. ప్రతీ విషయం తెలుసుకోండి

PM Kisan: దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన రైతులకు ప్రతి ఏటా రూ. 6వేలను డైరెక్ట్ బెన్ ఫిషరీ కింద నేరుగా రైతుల అకౌంట్లలో జమచేస్తుంది ప్రభుత్వం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం రైతుల ఖాతాల్లో 2వేలను జమచేస్తుంది. తాజాగా 19వ విడత పీఎం కిసాన్ సొమ్మును విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విడతలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారా? వారికి ప్రయోజనం లభిస్తుందా? లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. రైతులు తమ స్థితిగతులను పరిశీలించాలి. పీఎం కిసాన్ నిధులను పొందాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, ఆధార్ లింకింగ్ పూర్తిచేయాలి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారత ప్రభుత్వం ప్రధాన పథకం. భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం. ఈ పథకం కింద, అర్హులైన రైతులు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు విడుతలో సంవత్సరానికి రూ.6,000 పొందుతారు. ఈ సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే వస్తుంది. కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత 5 అక్టోబర్ 2024న విడుదలైంది. ఇప్పుడు 19వ విడత కిసాన్ సమ్మాన్ నిధి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 2025 ఫిబ్రవరి మొదటి వారంలో 19వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లోకి చేరవచ్చని సమాచారం. అయితే, ప్రభుత్వం అధికారికంగా తేదీని ధృవీకరించలేదు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వాయిదాలు ప్రతి నాలుగు నెలలకు విడుదల చేయబడతాయి.

లబ్ధిదారులు తమ వాయిదా స్థితిని ఎలా తనిఖీ చేయవచ్చు?

లబ్ధిదారులు ఈ క్రింది దశలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వారి వాయిదా స్థితిని తనిఖీ చేయవచ్చు:

1. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి (https://pmkisan.gov.in).

2. ‘బెనిఫిషియరీ స్టేటస్’ హోమ్‌పేజీకి వెళ్లండి: హోమ్‌పేజీలో, ‘బెనిఫిషియరీ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

3. మీ వివరాలను నమోదు చేయండి: మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను అందించండి.

4. స్టేటస్ తనిఖీ చేయండి: వివరాలను సమర్పించిన తర్వాత, మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్థితి ప్రదర్శించబడుతుంది.

పీఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

1. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. ‘కొత్త రైతు నమోదు’పై క్లిక్ చేయండి.

3. ఆధార్ నంబర్, రాష్ట్రం, జిల్లా, ఇతర సంబంధిత వ్యక్తిగ, బ్యాంక్ సమాచారం వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.

4. ఫారమ్‌ను సమర్పించి ప్రింటవుట్ తీసుకోండి.

మొబైల్ నంబర్‌ను పీఎం కిసాన్‌కి ఎలా లింక్ చేయాలి?

1.సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించండి లేదా https://pmkisan.gov.in కు లాగిన్ చేయండి.

2. ‘అప్‌డేట్ మొబైల్ నంబర్’ ఎంపికను ఎంచుకోండి.

3. మీ రిజిస్టర్డ్ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

4. ధృవీకరణ కోసం అభ్యర్థనను సబ్మిట్ చేయండి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version