https://oktelugu.com/

AP BJP: బిజెపి బహుముఖ వ్యూహం.. ఏపీలో వర్కౌట్ అవుతుందా?

ఏపీ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది. బలోపేతానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు.ముఖ్యంగా సామాజిక సమీకరణలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 5, 2024 / 11:42 AM IST

    AP BJP

    Follow us on

    AP BJP: బిజెపి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోందా? పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిందా? వచ్చే
    ఎన్నికల నాటికి బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏపీలో నడుస్తోంది. ఉమ్మడిగా ఉంటూనే ఎవరికి వారు పార్టీలను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలంగా ఉంది. జనసేన సైతం చేరికలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు బిజెపి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పొత్తులో భాగంగా ఈసారి ఎక్కువ నియోజకవర్గాలను ఆశిస్తోంది. అందుకే సమర్థవంతమైన నేతలను ప్రోత్సహించాలని భావిస్తోంది. వైసీపీ నుంచి చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రాయలసీమ,కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది.

    * ఆర్. కృష్ణయ్య ద్వారా బీసీలకు
    బలమైన బీసీ నినాదాన్ని పంపించాలని చూస్తోంది బిజెపి. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ పదవిని వదులుకున్నారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణకు చెందిన కృష్ణయ్య జాతీయస్థాయి బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఆయన బిజెపి వైపు అడుగులు వేస్తున్నారు.బిజెపి సైతం ఆయన పేరును రాజ్యసభ పదవికి ఖరారు చేసింది.దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీసీ నేతలు బిజెపి వైపు చూసే అవకాశం ఉంది. అదే సమయంలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ బిజెపి విషయంలో సానుకూలత ప్రదర్శిస్తున్నారు. దీంతో మాదిగలు సైతం యుటర్న్ తీసుకునే అవకాశం ఉంది. బిజెపిని బలపరిచే ఛాన్స్ కనిపిస్తోంది.

    * కిరణ్ కుమార్ రెడ్డికి బిజెపి పగ్గాలు
    ఇంకోవైపు రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. పొత్తులో భాగంగా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం నేతలకు బిజెపి టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వైసిపిలోని రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో.. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఏకకాలంలో అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది బిజెపి. మరి అవి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.