https://oktelugu.com/

‘బాస్’ మనసులో ఏముంది..? ఉత్కంఠగా గులాబీ శ్రేణులు..

కేటీఆర్ ముఖ్య మంత్రి అవుతారా..? సీఎం కేసీఆర్ తన బాధ్యతలు తనయుడికి అప్పగించేస్తున్నారా..? లేదా.. తలలో పేనులా మారిన బీజేపీని ఎదుర్కొనడానికి కొత్త వ్యూహాలు రచించేందుకు సిద్ధం అవుతున్నారా..? ఇంతకీ గులాబీ బాస్ మససులో ఏముంది..? అనే అంశంపై మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. గులాబీ నేతలే కాదు.. తెలంగాణ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం మరికొద్ది సేపట్లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 7, 2021 / 12:16 PM IST
    Follow us on


    కేటీఆర్ ముఖ్య మంత్రి అవుతారా..? సీఎం కేసీఆర్ తన బాధ్యతలు తనయుడికి అప్పగించేస్తున్నారా..? లేదా.. తలలో పేనులా మారిన బీజేపీని ఎదుర్కొనడానికి కొత్త వ్యూహాలు రచించేందుకు సిద్ధం అవుతున్నారా..? ఇంతకీ గులాబీ బాస్ మససులో ఏముంది..? అనే అంశంపై మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. గులాబీ నేతలే కాదు.. తెలంగాణ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం మరికొద్ది సేపట్లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే గులాబీ సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులకు కబురు పంపింది.. తెలంగాణ భవన్. అందరూ హైదరాబాద్ చేరుకుని గులాబీ బాస్ ఏం చెబుతారని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: కేసీఆర్ కు భయపడుతున్న చంద్రబాబు.. కారణం అదేనా..?

    తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా పరిస్థితులను సమీక్షించి.. ఉద్యమ స్పూర్తితో మరింత బలోపేతం చేయాలని, ప్రజలకు మరింత చేరువయ్యేలా తీర్చిదిద్దాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను ప్రజలతో మమేకం చేయాలని, సమస్యల పరిష్కారం దిశగా.. శ్రద్ధ చూపేలా దిశానిర్ధేశం చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 27న జరిగే.. ప్లీనరీలో పార్టీ ద్వి దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తన మనోభావాలు వెల్లడించనున్నారు సీఎం కేసీఆర్.

    2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. వచ్చే ఏప్రిల్ 27నాటికి ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉంది. దానికి మించి సభ్యత్వం తీసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాలను 15రోజులు మాత్రమే నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 15న ప్రారంభం కానుంది. ఈసారి ఆన్ లైన్ లోనూ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత పార్టీ సంస్థాగతంగా బలపడినా.. ఎన్నికలు.. ఇతర సందర్భాల్లో.. అప్పుడప్పు డూ.. కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. ఇలాంటివి ఎదురుకాకుండా పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారు సీఎం కేసీఆర్.

    Also Read: తమిళం వైపు ఆ ఇద్దరు సీఎంల చూపు…?

    పార్టీకి గ్రామ, మండల, రాష్ట్రస్థాయి కమిటీలు ఉన్నాయి. పొలిట్ బ్యూరో అవసరం లేదని.. రద్దు చేశారు. గత ప్లీనరీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కమిటీలు ఉంటాయని ప్రకటించారు. కానీ ఏర్పాటు కాలేదు. పార్టీ పటిష్టతకు కమిటీలను క్రీయాశీలకంగా మార్చాలని సీఎం భావిస్తున్నారు. జిల్లా కమిటీల రద్దును పున: సమీక్షిస్తున్నారు.

    టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నేతలకు పదవులపై ఆసక్తి పెరిగింది. ప్రభుత్వ ప్రాతినిథ్య పదవులే కాకుండా.. పార్టీకోసం పూర్తిస్థాయిలో పనిచేసే నేతలను తీర్చిదిద్దాలని సీఎం అనుకుంటున్నారు. ఇంకా కరోనా తగ్గనందున ఈసారి సభ జరపాలా..? లేదా.. అన్నదానిపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో 31 జిల్లాలలో పార్టీ కార్యాలయాలు పూర్తి అయ్యాయి. మరో రెండు జిల్లాలలో నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని సీఎం స్వయంగా ప్రారంభించాలని అనుకుంటున్నారు. భవనం అనంతరం జిల్లా నేతలు.. కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.విస్తృతంగా సేవలందించిన వారికి నియమిత పదవులపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు భావిస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్