https://oktelugu.com/

పది పాసైన వాళ్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీగా ఖాళీలు..?

దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు కరోనా విజృంభణ వల్ల గతేడాది ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ శుభవార్త చెప్పింది. మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది 9,069 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగగా ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2021 / 12:27 PM IST
    Follow us on

    దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు కరోనా విజృంభణ వల్ల గతేడాది ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ శుభవార్త చెప్పింది. మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది 9,069 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగగా ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.

    ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 21వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో ఫీజు చెల్లించడానికి మార్చి 23వ తేదీ చివరి తేదీగా ఉంది. చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి 2021 సంవత్సరం మార్చి 29 చివరి తేదీగా ఉంది. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్ (టైర్‌-1) 2021 సంవత్సరం జులై నెల 1వ తేదీ నుంచి 2021 సంవత్సరం జులై 20వ తేదీ వరకు జరగనుండగా టైర్‌-2 ప‌రీక్ష తేది (డిస్క్రిప్టివ్ పేప‌ర్) 2021 సంవత్సరం నవంబర్ నెలలో జరగనుంది. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలను బట్టి 18 – 27 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయో సడలింపులు ఉంటాయి. క‌ంప్యూట‌ర్ బేస్డ్ రాత ప‌రీక్ష (పేప‌ర్‌-1, పేప‌ర్‌-2) ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.