ఎమ్మెల్యేల వల్లే టీఆర్‌‌ఎస్‌కు ఈ దుస్థితా..?

ఉద్యమం సెంటిమెంట్‌తో రెండు సార్లు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌. ప్రజల్లో మొన్నటివరకు ఆ ఉద్యమం సెంటిమెంట్‌నే రగిల్చారు. అయితే.. ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితులు చేంజ్‌ అయ్యాయి. ఒక్కసారిగా కేసీఆర్‌‌ అంటే వ్యతిరేకత వచ్చింది. ఆయన పాలన నచ్చకనా.. లేక మరే కారణమా..? అంతుబట్టని విషయం. మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఆదరణ మాత్రం తగ్గిందనే చెప్పొచ్చు. Also Read: కేసీఆర్ కు భయపడుతున్న చంద్రబాబు.. కారణం అదేనా..? దీనిపై మేధోమథనం జరిపిన […]

Written By: Srinivas, Updated On : February 7, 2021 11:58 am
Follow us on


ఉద్యమం సెంటిమెంట్‌తో రెండు సార్లు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌. ప్రజల్లో మొన్నటివరకు ఆ ఉద్యమం సెంటిమెంట్‌నే రగిల్చారు. అయితే.. ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితులు చేంజ్‌ అయ్యాయి. ఒక్కసారిగా కేసీఆర్‌‌ అంటే వ్యతిరేకత వచ్చింది. ఆయన పాలన నచ్చకనా.. లేక మరే కారణమా..? అంతుబట్టని విషయం. మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఆదరణ మాత్రం తగ్గిందనే చెప్పొచ్చు.

Also Read: కేసీఆర్ కు భయపడుతున్న చంద్రబాబు.. కారణం అదేనా..?

దీనిపై మేధోమథనం జరిపిన టీఆర్ఎస్ నేతలకు అసలు కారణం ఎమ్మెల్యేల దగ్గర కనిపిస్తోంది. వారి తీరు వల్లే టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతోందని అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతికొద్ది మంది మినహా.. మిగతా ఎమ్మెల్యేలు అంతా అధికారం ఉందనే అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని.. ప్రజలకు సేవ కాకుండా.. వారిపై అజమాయిషీ చెలాయిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. అంతేకాదు.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా టైం పాస్ చేస్తున్నారని తేలినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పదంగా వ్యవహరించడం.. ప్రజా సమస్యల పట్ల పెద్దగా స్పందించకపోవడం.. అసలు అందుబాటులో ఉండకుండా సొంత వ్యాపారాలు.. ఇతర వ్యవహారాలకు సమయం కేటాయిస్తుండటంతో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు పార్టీకి నష్టం చేస్తున్నట్లుగా నిర్ణయానికి వచ్చారు.

ఈ పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్‌‌ కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారం. అందుకే హుటాహుటిన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారట. ఈ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకత్వ మార్పు.. ముఖ్యమంత్రి మార్పు వంటి అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేసే ఛాన్స్ లేదు. కానీ ప్రజల్లోకి.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వెళ్లే అవసరాన్ని ఎమ్మెల్యేలు హెడ్ వెయిట్‌ను ఎలా తగ్గించుకోవాలన్న అంశాన్ని తనదైన శైలిలో చెప్పే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయం ఇప్పుడు టీఆర్ఎస్ లో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Also Read: తమిళం వైపు ఆ ఇద్దరు సీఎంల చూపు…?

మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ అసంతృప్తిని గతంలోనే వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్ల తీరు వల్లే అత్యధిక సీట్లు కోల్పోయామని.. ఎమ్మెల్యేలు దాన్ని పాఠంగా తీసుకోవాలని గతంలోనే హెచ్చరించారు. చాలా మంది ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాల్సి ఉందన్నారు. అయితే ఎమ్మెల్యేలందరూ ఎవరి రాజకీయంవారు చేస్తూనే ఉన్నారు. ఎవరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఈ సారి అందరికీ ఇవ్వరన్న హెచ్చరికలు పంపుతున్నారు. ప్రణాళిక ప్రకారం ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది. కార్యవర్గ భేటీ తర్వాత వారికి ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌ చూస్తే.. టీఆర్‌‌ఎస్‌ కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మూడినట్లే అనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్