జగన్ మదిలో ఏముంది?

పెద్దల సభ రద్దుపై జగన్ ఆశలు వదులుకున్నారు. 2020లో జగన్ ఆవేశంతో, ఆగ్రహంతో శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేయించారు. అందుకు కారణాలేంటో అందరికీ తెలుసు. కానీ జగన్ ఆనాడు తొందరపడ్డారు. ఓపిక పడితే బాగుండేది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అనుభవం లేని జగన్ తొందరపాటు నిర్ణయంతో మండలి రద్దుకు తీర్మానం చేసి అభాసుపాలైనట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్ మీద కోపంతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మండలిని రద్దు చేయించారు. వైఎస్ జగన్ […]

Written By: Srinivas, Updated On : June 7, 2021 5:37 pm
Follow us on

పెద్దల సభ రద్దుపై జగన్ ఆశలు వదులుకున్నారు. 2020లో జగన్ ఆవేశంతో, ఆగ్రహంతో శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేయించారు. అందుకు కారణాలేంటో అందరికీ తెలుసు. కానీ జగన్ ఆనాడు తొందరపడ్డారు. ఓపిక పడితే బాగుండేది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అనుభవం లేని జగన్ తొందరపాటు నిర్ణయంతో మండలి రద్దుకు తీర్మానం చేసి అభాసుపాలైనట్లు తెలుస్తోంది.

1985లో కాంగ్రెస్ మీద కోపంతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మండలిని రద్దు చేయించారు. వైఎస్ జగన్ టీడీపీ మీద కోపంతో మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తాను తీర్మానం చేయించగానే మండలి రద్దు అయిపోతుందని జగన్ అనుకున్నారు. కానీ ఆయన అనుకున్న దానికి భిన్నంగా జరుగుతోంది.

ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మండలి రద్దు గురించి పట్టించుకోలేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఎవరైనా వ్యక్తి నేరం చేస్తే విచారణ జరిగి శిక్షపడేదాకా అతన్ని నిర్దోషిగా పరిగణిస్తారు. మండలి రద్దుపై కేంద్రం విచారించి పార్లమెంట్ లో అది ఆమోదం పొందేవరకు మండలి సజీవంగానే ఉంటుంది. ఖాళీ అయిన సభ్యుల స్థానాలు భర్తీ చేయాల్సిందే. మండలికి నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లను నియమించాల్సి ఉంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మండలిలో తగిన బలం లేకపోవడంతో రాజధాను వికేంద్రీకరణ బిల్లు, సీఆర్టీఏ బిల్లు రద్దు విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పడింది. అప్పటి చైర్మన్ షరీఫ్ వ్యవహరించిన తీరుపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మండలి రద్దు కోరుతూ తీర్మానం చేశారు. కానీ వైసీపీ సభ్యుు పెరగడంతో కొందరికి పదవులు వచ్చే అవకాశం ఉండడంతో కొనసాగించాలని నిర్ణయించారు.

మండలి చైర్మన్ గా ఇక్బాల్ ను నియమించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. హిందూపూర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన గతంలో చంద్రబాబు భద్రతా అధికారిగా పనిచేశారు. 2019లో ఇక్బాల్ హిందూపూర్ లో బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన 2027 మార్చి 29 వరకు పదవిలో ఉంటారు. డిప్యూటీ చైర్మన్ గా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడు జంగా కృష్ణ మూర్తికి కేటాయించే అవకాశాలున్నాయి.