https://oktelugu.com/

మోడీ సంచలనం: దేశ ప్రజలందరికీ ఉచిత టీకా, రేషన్

కొద్దిరోజులుగా కేంద్రంపై, ప్రధాని మోడీ పై వస్తున్న విమర్శలకు ఒకే ఒక్క ప్రసంగంతో ప్రధాని మోడీ తెరదించారు. రాష్ట్రాల రెండు నాల్కల ధోరణిపై మండిపడ్డారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలు, రాష్ట్రాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ సేకరణ పంపిణీకి చెక్ పెట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా టీకా, రేషన్ పంపిణీ చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే 8 నెలలు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుందని మోడీ ప్రకటించారు.  […]

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2021 / 05:44 PM IST
    Follow us on

    కొద్దిరోజులుగా కేంద్రంపై, ప్రధాని మోడీ పై వస్తున్న విమర్శలకు ఒకే ఒక్క ప్రసంగంతో ప్రధాని మోడీ తెరదించారు. రాష్ట్రాల రెండు నాల్కల ధోరణిపై మండిపడ్డారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలు, రాష్ట్రాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

    రాష్ట్రాలకు వ్యాక్సిన్ సేకరణ పంపిణీకి చెక్ పెట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా టీకా, రేషన్ పంపిణీ చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే 8 నెలలు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుందని మోడీ ప్రకటించారు.  ఇక రాష్ట్రాలు ఇక వ్యాక్సిన్లు సేకరించాల్సిన అవసరం లేదని.. కేంద్రమే దేశవిదేశాల నుంచి వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు ఇస్తుందని మోడీ ప్రకటించారు.దేశంలో కరోనా వ్యాక్సినేషన్ బాధ్యత మొత్తం కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

    దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో కేవలం 25శాతం మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తామని.. అది ఒక్కో వ్యాక్సిన్ ను రూ.150కి మించి ప్రజలకు చార్జ్ చేయరాదని మోడీ స్పష్టం చేశారు.

    ఈనెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేస్తుందని మోడీ వెల్లడించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ కు రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు.

    ఇక మూడో వేవ్ కు ముందే నవంబర్ లోపు దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని మోడీ సంచలన ధీమా వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కొరతను నెలరోజుల్లోనే తీర్చామని.. వ్యాక్సినేషన్ కూడా అలాగే చేస్తామని మోడీ ప్రకటించారు.

    ఇక కరోనాతో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధను పంచుకుంటున్నానని.. ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు బాగా పెంచామని మోడీ తెలిపారు.  ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.