Homeజాతీయ వార్తలుDera Baba: హర్యానాలో బీజేపీ సాధించిన విజయంలో డేరా బాబా పాత్ర ఎంత.. ఎన్నికలకు ముందు...

Dera Baba: హర్యానాలో బీజేపీ సాధించిన విజయంలో డేరా బాబా పాత్ర ఎంత.. ఎన్నికలకు ముందు అతడికి పెరోల్ ఎందుకు వచ్చింది?

Dera Baba: ఈసారి ఎన్నికల్లో డేరా బాబా కు పెరోల్ మంజూరు కావడం సంచలనంగా మారింది. అది కూడా ఎన్నికలకు ముందు ఆయనకు పెరోల్ రావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు డేరా బాబాకు పెరోల్ ఇచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డేరా బాబా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాలుగు రోజులు అతడికి 20 రోజులపాటు బెయిల్ లభించింది.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం పలు వర్గాల నుంచి మద్దతు కోసమే డేరా బాబాకు బెయిల్ మంజూరు చేయించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే డేరా బాబా బయటికి రావడం వల్ల ఏ పార్టీకి కలిసి వచ్చిందనే అంశం హర్యానా రాష్ట్రంలో చర్చకు దారితీస్తోంది. డేరా బాబా కు 28 అసెంబ్లీ నియోజకవర్గాలలో మద్దతుదారులు ఉన్నారు. ఈ 28 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ 15, భారతీయ జనతా పార్టీ 10, ఐఎన్ ఎల్ డీ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి 53.57, భారతీయ జనతా పార్టీకి 35.71, ఐఎన్ ఎల్ డీ కి 7 శాతం, స్వతంత్ర అభ్యర్థులకు 3.57% ఓట్లు వచ్చాయి. ఈ ప్రకారం చూసుకుంటే డేరా బాబా మద్దతుదారులు అధికంగా ఉన్న 28 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీగా లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఇక జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హర్యానా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని డేరా బాబా ఒక కార్యక్రమంలో తన అనుచరులను కోరినట్టు తెలుస్తోంది.. తన అనుచరుడు అయిదురు ఓటర్లను బూత్ దాకా తీసుకురావాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. డేరా బాబా గతంలో శిరోమణి అకాలిదల్, కాంగ్రెస్ పార్టీలకు గతంలో బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. 2007లో జరిగిన హర్యానా, పంజాబ్ ఎన్నికలలో డేరా బాబా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. 2014 లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భారత జెండా పార్టీకి మద్దతు ఇచ్చారు.

20 రోజుల గడువు

అక్టోబర్ 2న డేరా బాబా పెరోల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు 20 రోజుల గడువు మాత్రమే కోర్టు విధించింది. పైగా ఆయనను హర్యానాలో ప్రవేశించకూడదని నిబంధన విధించింది. అక్టోబర్ 5న హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అయితే అంతకంటే ముందే డేరా బాబా 20 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అక్కడికి పెరోల్ మంజూర అయింది. అనిబంధనల ప్రకారం డేరా బాబా ఎన్నికలకు దూరంగా ఉండాలని కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది.. పెరోల్ లభించిన నేపథ్యంలో డేరా బాబా తన అనుచరులతో సత్సంగ అనే కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆ కార్యక్రమంలో బిజెపికి ఓటు వేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. కాగా, 2017లో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాకు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇక 16 సంవత్సరాల క్రితం ఒక పాత్రికేయుడిని హత్య చేసిన కేసులోనూ డేరా బాబాతో పాటు మరో ముగ్గురికి 2019లో కోర్టు జైలు శిక్ష విధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version