https://oktelugu.com/

City Cable Video : సిటీ కేబుల్ లో ఆ వీడియోలు.. ఏకంగా గంటపాటు.. కలకలం

ఎక్కువమంది సిటీ కేబుల్ ను ఆశ్రయిస్తారు.స్థానిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని భావించి వాటిని ఎంచుకుంటారు. ప్రైవేటు డిష్ కంపెనీలు అందుబాటులోకి వచ్చినా ఎక్కువగా లోకల్ కేబుల్ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. అయితే కేబుల్ టీవీ నిర్వాహకుల నిర్లక్ష్యం.. కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటిదే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 9, 2024 / 04:35 PM IST

    City Cable Video

    Follow us on

    City Cable Video : అందరూ టీవీలు చూస్తున్నారు. నచ్చిన సినిమాలు, సీరియళ్లు, ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్నారు. అయితే ఒక్కసారిగా అందరి టీవీల్లో బూతు వీడియోలు ప్రసారం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదివేల టీవీ కనెక్షన్లలో అశ్లీల వీడియోలు హల్ చల్ చేశాయి. గంట పాటు బూతు బొమ్మలే కనిపించాయి. దీంతో కుటుంబమంతా కలిసి టీవీలు చూస్తున్న వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు సిటీ కేబుల్ లో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరులో ఫిరోజ్ కేబుల్ రన్ అవుతోంది. సుమారు పదివేల వినియోగదారులు ఉంటారు ఈ కేబుల్ ఆపరేటర్ కు. అయితే కేబుల్ ఆపరేటర్ల అజాగ్రత్తతో ఒక్కసారిగా బూతు వీడియోలు ప్రసారం అయ్యాయి. దసరా సెలవులు కావడంతో పిల్లాది మొదలు మహిళలు, పెద్దవారు టీవీలకు అతుక్కుపోయారు. అలాంటి సమయంలో ఈ వీడియోలు ప్రసారం కావడంతో అసౌకర్యానికి గురయ్యారు. మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు.

    * పట్టించుకోని ఆపరేటర్లు
    సిటీ కేబుల్ నడుపుతున్న ఫిరోజ్ కి నియోజకవర్గంలో దాదాపు పదివేల కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు గంటపాటు బూతు వీడియోలు ప్రసారమైనా.. కేబుల్ ఆపరేటర్లు పట్టించుకోలేదు. దీంతో మహిళలు అసౌకర్యానికి గురయ్యారు. కేబుల్ ఆపరేటర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఈ విషయంపై ప్రశ్నించేందుకు కేబుల్ యజమానిని సంప్రదించగా ఆయన అందుబాటులో లేకుండా పోయారు. గతంలో కూడా ఈ కేబుల్లో ఇలాంటి ప్రసారాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

    * ట్రాయ్ కి ఫిర్యాదు
    కాగా నందికొట్కూరు సిటీ కేబుల్ లో బూతు వీడియోలు ప్రసారం అయిన నేపథ్యంలో సదరు కేబుల్ నెట్వర్క్ పై ట్రాయ్ కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను సంఘవిద్రోహ చర్యగా భావించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు. అయితే ఏకంగా కేబుల్ టీవీలో బూతు వీడియోలు ప్రసారం కావడం సంచలనం గా మారింది.