Viral Video(4)
Viral Video: ఇక ఇటీవల లవ్.. అంటే ప్రియురాలు లేదా ప్రియుడిపై చూసేదే ప్రేమ అన్న భావన ఉంది. ఇక నేటితరం తమ ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తుంది. వ్యక్త పరిచే విధానం వేరైనా.. భానవ, భావం మాత్రం ఒక్కటే. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రేమికుల దినోత్సవం రోజు ప్రపోజ్ చేసుకుంటారు. కొందరు ఆకావంలో ప్రపోజ్ చేస్తారు. కొందరు నీటిలో, కొందరు దైవ సాక్షిగా, కొందరు అగ్నిసాక్షిగా, కొందరు పంచభూతాల సాక్షిగా ప్రేమను వ్యక్తం చేస్తారు. తాజాగా ఓ యువతి తను ప్రేమించిన యువకుడికి విమానంలో లవ్ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది. ఈ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నింగిలో లవ్ ప్రపోజ్..
తన ప్రియుడికి వెరైటీగా తన ప్రేమను వ్యక్తం చేయాలని భావించిన ఓ యువతి.. ప్రియుడు ఫ్లైట్‌లో వెళ్తున్న విషయం తెలుసుకుంది అదే ఫ్లైట్‌లో తను కూడా టికెట్ బుక్ చేసకుంది. ప్రయుడు ఎయిర్ పోర్టుకు రాకముందే.. తను చేరుకుని విమానం ఎక్కింది. సిబ్బందికి ముందే విషయం చెప్పింది. ప్రియుడు ఫ్లైట్ ఎక్కగానే.. టేకాఫ్‌కు కొద్ది సేపటికి ముందు.. తన ప్రయుడు కూర్చున్న సీటు వద్దకు చేరుకుని తన వెంట తెచ్చుకున్న రింగ్ బాక్స్ ఓపెన్ చేసింది. మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను వ్యక్తం చేసి అందరి సాక్షిగా సర్‌ప్రైజ్ చేసింది. దీనిని చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. అంతలోనే తేరుకుని చప్పట్లతో వారి ప్రేమకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. వెంటనే విమాన సిబ్బంది కేక్ తెచ్చి.. వారితో కట్ చేయించారు.
వీడియో వైరల్..
ప్రయుడికి ప్రియురాలు చేసిన వెరైటీ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. polictical power447 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీనిని పోస్టు చేశారు. దీనికి తెలుగు సినిమా పాటను కూడా చోడించారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొత్త ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.