Taj Mahal- Indira Gandhi: షాజహాన్ రాణిముంతాజ్ మహల్ సమాధి కాదా? అది ఆగ్రా నగరంలోని రాజపుత్రులు పూజించే శివుని పురాతన హిందూ దేవాలయమా?. ఈ ఆలయాన్ని పూర్వం అప్పట్లో తేజో మహాలయ అని పిలిచేవారా? పురాతన చరిత్రకారుడు ఒక్ మహాశయుడు చేసిన పరిశోధనలు ఏం తెలియచేస్తున్నాయి? తన పరిశోధనలో ఓక్, శివ మందిర్ ప్యాలెస్‌ను అప్పటి జైపూర్ మహారాజా జై సింగ్ నుంచి షాజహాన్ స్వాధీనం చేసుకున్నట్లు కనుగొన్నాడా? అంటే దీనికి ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. షాజహాన్ స్వాధీనం చేసుకున్న ఆలయ నిర్మాణాన్ని తన భార్య ముంతాజ్ స్మారక చిహ్నంగా మార్చాడు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే తేజోమహాలయంలో షాజహాన్, ముంతాజ్ దేహాన్ని ఖననం చేసేందుకు జై సింగ్ నుంచి ఆగ్రాలోని అసాధారణమైన అందమైన గొప్ప సుందరమైన దేవా ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తన స్వీయచరిత్రలో అంగీకరించాడు.జైపూర్ మహారాజా తేజో మహాలయను అప్పగించాలని షాజహాన్ చేసిన రెండు ఆదేశాలను సమర్థించాడని ఒక్ పరిశోధనలలో తేలింది. స్వాధీనం చేసుకున్న దేవాలయాలు, భవనాలను చనిపోయిన సభికులు రాచరికం కోసం శ్మశాన స్థలాలుగా ఉపయోగించడం ముస్లిం పాలకులు ఈ దేశంలో ఒక సాధారణ ఆచారంగా పాటించే వారు.

ఉదాహరణకు హమాయున్, అక్బర్, ఇత్ముద్-ఉద్-దౌలా, సఫ్దర్‌జంగ్‌లు ఇలాంటి భవనాలలో ఖననం అయ్యారు. అంతే కాదు వేములవాడ ఆలయ ప్రాంగణంలో ముస్లీం దర్గా నేటికీ వారు పాటించిన ఆచారాన్ని మనందరికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఓక్ రహస్య విచారణ తాజ్ మహల్ అనే పేరు నుంచి ప్రారంభమవుతుంది. షాజహాన్ కాలం లోనూ ఆ తరవాత కూడా తాజ మహల్ అనే ఈ పదం ఏ మొఘల్ కోర్టు పత్రాలలో లేదా రెవిన్యూ రికార్డ్స్ లో నమోదు కాలేదు. మొఘల్ చరిత్రలో ఎక్కడా కూడా ఈ పదం కనిపించలేదని అతను చెప్పాడు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్జీరియా వరకు ఏ ముస్లిం దేశంలోనూ “మహల్’ అనే పదాన్ని ఏ భవనానికి ఉపయోగించలేదు.
అయితే మహల్ అంటే ఒక బహుళ అంతస్థుల భవనం అర్థం అయితే ఈ పదం “ప్రజల సమూహానికి నివాస గృహాలు” అని కూడా సూచించవచ్చు. ఇది పర్షియన్ పదం హల్ నుంచి ఉద్భవించిన భారతీయ పదం, అని కొందరి వాదన .. అయితే హల్ అనే పదానికి గమ్యం అనే అర్థం మాత్రమే వస్తుంది. అంతేకానీ నివాస స్థానం అనే అర్థం రాదు. ఇంకా చెప్పాలంటే మనదేశానికి పారశీకులు అరబ్బులు రాకముందే మహల్ పేరుతో ఎన్నో కట్టడాలు ఈ దేశంలో ఉన్నాయి ఉదాహరణకు “జానకీ మహల్” తిరుమలై నాయక్కర్ మహల్ ఇలా చాలా పురాతనమైన భారతీయ కట్టడాలను మహల్ పేరుతో వ్యవహరించటం పరిపాటి. కాబట్టి ముంతాజ్ మహల్ నుంచి ‘తాజ్ మహల్’ అనే పదం రూపొందింది. అనే సాధారణ వివరణ పై పరిశీలనల ను పట్టి అశాస్త్రీయమైనది. అని తేల్చి చెప్పాడు రచయత.
తేజో మహాలయ రూపం
తాజ్ మహల్ అనేది తేజోమహాలయ లేదా తేజేశ్వర మహాలయ అనే పదాల వికృత రూపం కాల క్రమంలో తాజ్ మహల్ గా మారిందని వారు పేర్కొన్నారు.
ముంతాజ్, షాజహాన్ ల ప్రేమకథ కు ఎటువంటి సాహిత్య, చారిత్రక ఆధారాలు లేవు. బ్రిటీష్ ఇండియాలో అమ్ముడు బోయిన చరిత్రకారులు, దేశ పురాతన చరిత్ర పై శ్రద్ధాసక్తులు లేని పురావస్తు శాస్త్రవేత్తలు సృష్టించిన అద్భుత కల్పిత కథ అని కూడా ఓక్ చెప్పారు. షాజహాన్ కాలంలోని సమకాలీన రాజుల చరిత్ర ఒక్కటి కూడా ఈప్రేమకథను ధృవీకరించటంలేదు. శైవ శాఖలు ఉప శాఖలు ఆగమ శాస్త్రం ప్రకారం త్రిశూలం ను పవిత్రంగా భావిస్తాయి ఈ త్రిశూల ఆకారంలో దాని మధ్య నాలుకలా ఒక్కటి మిగిలిన రెండింటి కంటే ఎక్కువ విస్తరించి ఉంటుంది. ఇది సర్వ సాధారణంగా మనకు కనిపించే శైవాగమ గోపుర నిర్మాణం. ఈ నిర్మాణాన్ని దగ్గరగా చూస్తే, మధ్య నాలుక “కలశం” (నీటి కుండ) ఆకారంలో రెండు మడతలు పెట్టిన మామిడిఆకులు, పైన కొబ్బరికాయతో కనిపిస్తుంది. ఇది పవిత్రమైన హిందూ చిహ్నం. మనం నేడు తాజ్ మహల్ గా పిలిచే కట్టడ గోపురం పై చిహ్నాలు కనిపిస్తాయి.త్రిశూలం శిఖరం లోపల పూజించే అధి దేవత చిహ్నం కావచ్చని చరిత్రకారుల అభిప్రాయం. చిహ్నాలు నేరుగా హిందూ ధర్మానికి చెందినవని, వాటిలో కొన్ని నాగుపాములు కూడాఉన్నాయి. ఇస్లాం ధర్మం లో సర్ప ఆరాధన లేదు “మకరతోరణం” వంటి అలంకరణలు ఉండవు. గోడలపై రాతితో మలిచిన పూలలో “ఓం” చిహ్నాన్ని కూడా గుర్తించారు. తాజ్ మహల్ షాజహాన్ యుగానికి ముందే ఉందని సూచించడానికి ఓక్ అనేక పత్రాలను ఉదహరించారు:
న్యూయార్క్_ప్రొఫెసర్ మార్విన్ మిల్లర్ తాజ్ మహల్ యుమున నదీతీరపు వాకిట తలుపు నుంచి పలు నమూనాలను తీసుకున్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షలో షాజహాన్ కంటే తలుపు 300 సంవత్సరాల పురాతనమైనది అని తేలింది. 1638లో (ముంతాజ్ మరణించిన ఏడేళ్ల తర్వాత) ఆగ్రాను సందర్శించిన యూరోపియన్ యాత్రికుడు జోహాన్ ఆల్బర్ట్ మాండెల్‌స్లో తన జ్ఞాపకాలలో అగ్రా నగరంలో ప్రజా జీవితాన్ని వివరించాడు, కానీ తాజ్ మహల్ నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. ముంతాజ్ మరణించిన ఒక సంవత్సరం లోపు ఆగ్రాకు వచ్చిన ఆంగ్ల సందర్శకుడు పీటర్ ముండి రచనలు, షాజహాన్ కాలానికి చాలా కాలం ముందు తేజో మహాలయం ఒక అద్భుతమైన నిర్మాణం అని చెపుతోంది. తాజ్ మహల్ ముంతాజ్ సమాధి కాకుండా ఒక ప్రత్యేకమైన హిందూ దేవాలయం అనే నమ్మకానికి మద్దతు ఇచ్చే అనేక ఆకృతులను, నిర్మాణ వైరుధ్యాలను కూడా ఓక్ తన పరిశీలన లో గుర్తించాడు. ఇవన్నీ కూడా మనకు ఇస్లాం ధర్మంలో వారి నిర్మాణశైలి లో ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. షాజహాన్ కాలం నుంచి తాజ్ మహల్ లో అనేక గదులను మూసి వేశారు.

ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేవు. ఆ గదులలో శివుని తల లేని విగ్రహం, హిందూ దేవాలయాలలో పూజా ఆచారాలకు సాధారణంగా ఉపయోగించే ఇతర వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిజాలు బయట పడితే రాజకీయంగా తనకు తగిలే ఎదురుదెబ్బలకు భయపడి, నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓక్ పుస్తకాన్ని పుస్తక దుకాణాల నుంచి ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించింది. మొదటి ఎడిషన్ భారతీయ ప్రచురణకర్తను తీవ్రంగా బెదిరించింది. అని అప్పటి రాజకీయ నాయకులు అధికార్లు చెవులు కొరుక్కుంటూ ఉండేవారు. ఇక తాజ్ మహల్ లో రహస్యం ఏమిటంటే, షాజహాన్ ఆగ్రాను పరిపాలించడానికి చాలా కాలం ముందు అంటే దాదాపు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయ కట్టడం నిర్మించారని ప్రతీతి. అంటే అప్పటికి మొఘల్ లు ఇంకా పాలకులు గా భారత్ లోకి అడుగు పెట్టక ముందే ఈ ఆలయ కట్టడం ఉనికిలో ఉంది. తాజ్ మహల్ నిజమైన కథ ఒక్ రాసిన పుస్తకం ప్రకారం, ఈ కట్టడం మొదట ఆగ్రాలోని రాజపుత్రులు నిర్మించిన శివుని ఆలయంగా ఉండేది. రాజపుత్రులతో జరిగిన యుద్ధంలో షాజహాన్ గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది నాటి తేజో మహాలయం లేదా నేటితాజ్ మహల్ వెనక దాగి ఉన్న రహస్యం.