Pawan Kalyan- Surekha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీది ప్రత్యేకం. చిరంజీవి తరువాత ఆయన వారసులు ఎంతో మంది సుప్రీం అడుగుజాడల్లో నడిచారు. ఎంతమంది నటులు సినిమాల్లో ఉన్నా రియల్ గా జరిగే ఫంక్షన్లకు అందరూ ఒక్కచోటికి చేరిపోతుంటారు. మధ్యలో ఎన్ని విభేదాలు వచ్చినా.. పండుగ సమయంలో అవన్నీ మరిచిపోయి కలిసిపోతారు. అందుకే మెగా కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటికీ అన్యోన్యత చెరగదంటారు. ఈ కుటుంబంలో పవన్ కల్యాణ్ అంటే అందరికీ ఇష్టమే. చిరంజీవి బ్రదర్స్ లో చిన్నవాడైన ఈయన చిన్నప్పుడు చేసిన అల్లరి అందరిని అకట్టుకునేది. ఇప్పుడు సీనీ స్టార్ గా..రాజకీయనాయకుడిగా ఎదిగిన పవన్ ను చూసి అందరూ గర్వంగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి.. పవన్ ను చిన్నపిల్లాడిలా చూసుకునేది. వీరిద్దరి మధ్య తల్లీకొడుకుల అన్యోన్యత ఉండేది. ఇందులో భాగంగా పవన్ కు ఇటీవల సురేఖ కారు గిప్ట్ గా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది..మరి అందులో నిజమెంత..? అనేది చూద్దాం.

సురేఖను పవన్ ఎప్పటికీ తల్లితో సమానం చూస్దారు. అటు సురేఖ కుడా పవన్ ను తన కొడుకులాగే భావించేది. మెగాస్టార్ చిరంజీవి పెళ్లి అయిన సమయంలో పవన్ చిన్నపిల్లాడు. ఆ తరువాత చదువుకునే రోజుల్లో ఆయనను సినిమాల్లోకి తీసుకోవాలని మెగాస్టార్ తో సురేఖ మాట్లాడింది. సురేఖ కోరిక మేరకే పవన్ సినిమాల్లోకి వచ్చారని అంటారు. పవన్ ఎదుగుదలను చూసి మిగతా వారి కంటే ముందుగానే సురేఖ అత్యంత సంతోషంగా ఫీలయ్యేదట. పవన్ సినిమాల్లో, రాజకీయాల్లో చేసే కార్యక్రమాలకు సురేక మద్దతు ఇస్తూ వస్తోంది.
2020 సెప్టెంబర్ లో పవన్ ఏపీలోని అంతర్వేది రథం దగ్ధం ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను పరిరక్షించాలని ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. 2020 సెప్టెంబర్ 12న అందరూ 5.30 నుంచి 6.30 గంటల మధ్య దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. అలా దీపారాధన చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాలని పేర్కొన్నారు. పవన్ పిలుపునకు చిరంజీవి సతీమణి సురేఖ స్పందించారు. ఆరోజు సాయంత్రం తులసి మొక్కను పూజించి దీపం వెలిగించారు.

ఆ తరువాత గతేడాది చిరంజీవి బర్త్ డే సందర్భంగా పవన్ కుటుంబ సభ్యులంతా చిరంజీవి ఇంట్లో కలుసుకున్నారు. ఆ సమయంలో ‘ఏవండి సురేఖ గారూ..’ అంటూ సరేఖను పవన్ పిలిచారు. దీంతో సురేఖ పవన్ భుజంపై ఒక్కటేసింది. ఆ తరువాత ఆలింగనం చేసుకుంది. ఇలా వీరు ఎంతో సంతోషంగా ఉంటారు.ఈ తరుణంలో పవన్ కు సురేఖ కారు గిప్ట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
పవన్ దగ్గర ప్రస్తుతం 8 కార్లు ఉన్నాయి. ఒక్కో కారు విలువ రూ.19 లక్షలు ఉంటుందని అంచనా. జనసేన పార్టీ కోసమే ఈ కార్లను కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే తాజాగా మరో కారు చిరంజీవి సతీమణి గిప్ట్ గా ఇచ్చారని అంటున్నారు. కానీ ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. పవన్ ఈ విషయం చెబితే గానీ నమ్మే అవకాశం లేదని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.