Homeజాతీయ వార్తలుCM Vijay: లంచం తీసుకున్న టీవీకే నేతకు సీఎం విజయ్ ఊహించని శిక్ష

CM Vijay: లంచం తీసుకున్న టీవీకే నేతకు సీఎం విజయ్ ఊహించని శిక్ష

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఇటీవలే ఎవరికీ లంచం ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే తనకు చెప్పాలని తమిళనాడు ప్రజలకు పిలుపు ఇచ్చారు. నిజాయతీగా ప్రజలకు సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. తనకు ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు. అయితే తాజాగా పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు వీరస్వామి ఒక ప్రభుత్వ సంబంధిత పని కోసం కాంట్రాక్టర్‌ను సంప్రదించి, రూ.1.30 లక్షల నగదు లంచం అడిగాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. డబ్బులు ఇచ్చే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే పార్టీలోని నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమైంది. వీరస్వామి చేసిన ఈ చర్య పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా ఉందని అందరూ భావించారు.

సీఎం విజయ్‌ తక్షణ చర్యలు..
వైరల్‌ అవుతున్న వీడియో సీఎం విజయ్‌ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే తీవ్రంగా స్పందించారు. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు. వీరస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగించారు. అతనికి ఉన్న అన్ని బాధ్యతలు, పదవుల నుంచి తప్పించారు. అవినీతి విషయంలో ఎంతటి కీలక నేత అయినా సహించబోమని, ఎవరినీ వదలనని ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అవినీతి రహిత పాలన హామీకి కట్టుబడి ఈ చర్య తీసుకున్నారు.

మాట నిలబెట్టుకున్న అధినేత..
సొంత పార్టీ నేతపైనే ఇంత కఠినమైన చర్య తీసుకోవడంతో ప్రజలు, రాజకీయ విశ్లేషకులు విజయ్‌ను ప్రశంసిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వేలాది మంది ‘చెప్పిన మాటకు అమలు చేస్తున్న నాయకుడు ఇలాగే ఉండాలి’ అని అభినందిస్తున్నారు. ఈ ఘటనతో మిగిలిన నేతలకు బలమైన హెచ్చరిక. అవినీతి చేస్తే ఎవరూ రక్షణ పొందలేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవినీతి నిర్మూలనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ నిర్ణయం చూపిస్తోంది.

రాజకీయాల్లో కొత్త ప్రమాణాలు..
ఈ చర్య విజయ్‌ నాయకత్వ పటిమను మరింత బలపరుస్తోంది. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. అవినీతి రహిత తమిళనాడు నిర్మాణం అనే లక్ష్యం వైపు ఇది ముందడుగు అని చాలామంది భావిస్తున్నారు. ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఇలాంటి చర్యలు తీసుకోవాలని చర్చ మొదలైంది.

ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ హాట్‌ టాపిక్‌గా కొనసాగుతోంది. విజయ్‌ అవినీతిపై ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నారో ఇది మరోసారి నిరూపించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version