https://oktelugu.com/

ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ

అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పిన ధోనీ.. ఐపీఎల్‌కి కూడా ఈ ఏడాదే రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అందరూ ఊహించారు. ఎందుకంటే.. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా నిరాశపరిచిన ధోనీ.. కెప్టెన్‌గానూ తేలిపోయాడు. దాంతో 13 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారి చెన్నై టీమ్‌ ప్లేఆఫ్‌కు చేరకుండానే ఇంటి దారి పడుతోంది. Also Read: సన్ రైజర్స్, బెంగళూరు మ్యాచ్: అంపైరింగ్‌పై ప్లేయర్స్‌ ఆరోపణలు చెన్నై ఓటములకు ధోనీ పేలవ నిర్ణయాలే కారణమని ఎండగట్టిన అభిమానులు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 06:10 PM IST
    Follow us on

    అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పిన ధోనీ.. ఐపీఎల్‌కి కూడా ఈ ఏడాదే రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అందరూ ఊహించారు. ఎందుకంటే.. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా నిరాశపరిచిన ధోనీ.. కెప్టెన్‌గానూ తేలిపోయాడు. దాంతో 13 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారి చెన్నై టీమ్‌ ప్లేఆఫ్‌కు చేరకుండానే ఇంటి దారి పడుతోంది.

    Also Read: సన్ రైజర్స్, బెంగళూరు మ్యాచ్: అంపైరింగ్‌పై ప్లేయర్స్‌ ఆరోపణలు

    చెన్నై ఓటములకు ధోనీ పేలవ నిర్ణయాలే కారణమని ఎండగట్టిన అభిమానులు.. వచ్చే ఏడాది సీనియర్లందరినీ తప్పించి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగాలని చెన్నై ఫ్రాంఛైజీకి సోషల్ మీడియాలో సూచనలు చేశారు. మరోవైపు ధోనీ కూడా రెండు వారాల నుంచి ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లకి గుర్తుగా తన జెర్సీని బహూకరిస్తూ కనిపించాడు. దాంతో అతని రిటైర్మెంట్ ఖాయమని వార్తలు వచ్చాయి .

    అయితే.. అబుదాబి వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆదివారం చెన్నై తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై.. కెప్టెన్‌ ధోనీ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నారు. ఆ వెంటనే మ్యాచ్ కామెంటేటర్‌‌గా ఉన్న డ్యానీ మారిసన్.. ‘ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇదే మీ చివరి మ్యాచ్..?’ అని పరోక్షంగా రిటైర్మెంట్ గురించి ప్రశ్నించాడు. దాంతో ధోనీ ‘కచ్చితంగా కాదు’ అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. దాంతో ఐపీఎల్‌లో ధోనీ రిటైర్మెంట్‌పై పూర్తి క్లారిటీ వచ్చినట్లయింది.

    Also Read: ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్ పై రేపు బీసీసీఐ కీలక నిర్ణయం

    ఐపీఎల్ 2020 సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 5 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఈరోజు పంజాబ్‌తో మ్యాచ్‌ ఆ టీమ్‌కి ఆఖరికాగా.. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ చెన్నై టీమ్‌ని కెప్టెన్‌గా ధోనీనే నడిపిస్తాడని ఇటీవల చెన్నై టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తాజా ప్రకటనలతో ధోనీ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాన ఆటగాడు మరికొద్ది రోజులు మ్యాచ్‌లు ఆడుతాడని హ్యాపీగా ఉన్నారు.