కరోనా కట్టడికి చర్యలేవి?

భారతదేశంలో కరోనా రక్కస విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడంలేదు. లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఆర్థిక వ్యవస్థపై ఉన్న మమకారంతోనే లాక్ డౌన్ విధించేందుకు ముందుకు రాకపోవడంతో జనం అల్లాడుతున్నారు. తమ ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఏమి చేయాలో తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత జరుగుతున్నా వేలాది మంది ప్రాణాలు పోతున్నా తమకేమి సంబంధం లేదన్నట్లుగా వ్రభుత్వాల పనితీరు […]

Written By: Srinivas, Updated On : May 9, 2021 3:33 pm
Follow us on

భారతదేశంలో కరోనా రక్కస విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడంలేదు. లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఆర్థిక వ్యవస్థపై ఉన్న మమకారంతోనే లాక్ డౌన్ విధించేందుకు ముందుకు రాకపోవడంతో జనం అల్లాడుతున్నారు. తమ ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఏమి చేయాలో తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత జరుగుతున్నా వేలాది మంది ప్రాణాలు పోతున్నా తమకేమి సంబంధం లేదన్నట్లుగా వ్రభుత్వాల పనితీరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తే వచ్చే నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు.

లాక్ డౌన్ ఒక్కటే మార్గమని
కరోనా ఉధృతి తగ్గించడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని శాస్ర్తవేత్తలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రోజురోజుకు లక్షల కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. లాక్ డౌన్ విధించే అవకాశమే లేదని స్పష్టం చేస్తోంది. ఈనేపథ్యంలో కరోనా వైరస్ నిర్మూలనకు పాటుపడాల్సిన ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందోనని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆర్థిక వ్యవస్థపై
ఆర్థిక వ్యవస్థపై ఉన్న ప్రేమతోనే లాక్ డౌన్ విధించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. కేవలం ఆర్థిక వ్యవస్థ కోసమే ప్రజల ప్రాణాలను అడ్డుగా పెట్టాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంతో పాటు స్టేట్లు సైతం లాక్ డౌన్ విధించేందుకు నడుం బిగించాలి. అప్పుడే కరోనా తగ్గుముఖం పట్టే వీలుంటుంది. ప్రభుత్వాలు సైతం తమ ఒంటెద్దు పోకలను మానుకుని ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడాలని ఆశిస్తున్నారు.

మేల్కోవాలి
ప్రభుత్వాలు మేల్కోకపోతే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకారిగా పరిణమిస్తోంది. ఫలితంగా మరణాల రేటు సైతం పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాల పక్షపాత ధోరణి వీడి ప్రజామోదం కోసం కరోోనా వైరస్ నిరోధించడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని గుర్తించి దాని విస్తరణను అడ్డుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈటల పార్టీకే ఓటు