సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల వారసులుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావడం అంటే, అంత ఈజీ కాదు. ఛాన్స్ అయితే సులభంగానే వస్తోంది. కానీ, ప్రేక్షకులను మెప్పించడం మాత్రం వాళ్లకు అంత తేలిగ్గా వంట పట్టదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమాల్లోకి వచ్చే వాళ్లకు, కష్టం విలువతో పాటు గ్రౌండ్ లెవల్స్ పై కూడా పూర్తి అవగాహనా ఉంటుంది.
పైగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి ? లాంటి విషయాల్లో వాళ్ళు ఎంతో ముందుచూపుతో ఉంటారు. కానీ వారసులకు ఆ అవకాశం లేదు. ఈ విషయం లేట్ గా అర్ధం చేసుకుంది స్టార్ హీరో కుమార్తె. సీనియర్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ బేటీగా సారా అలీ ఖాన్ కి మొదటి సినిమాతోనే మంచి స్టార్ డమ్ వచ్చింది.
పైగా చాలామంది స్టార్ కిడ్స్ లా ఆమెను ఆడియన్స్ పై రుద్దాల్సిన పరిస్థితి కూడా ఆమెకు రాలేదు. ఆమెకు మొదటి నుండి మంచి ఆదరణ దక్కింది. అయితే సారా మాత్రం భిన్నంగా సినిమాలు చేయాలనే తపనతో గొప్ప అవకాశాలను వదులుకుంది. ఈ రోజు కియారా అద్వానీ అంటే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కానీ కియారాని స్టార్ ను చేసిన పాత్రలు అన్నీ మొదట సారాకే వచ్చాయి.
కేవలం తెలియని తనంతో వచ్చిన ఛాన్స్ లను వదులుకుని, కియారా అద్వానీని స్టార్ ను చేసింది. సారా చేతిలో ప్రస్తుతం ఆఫర్లు అయితే ఉన్నాయి కానీ, అవి ఆమె స్థాయికి తగ్గ ఆఫర్లు కాదు. ఏది ఏమైనా ఈ తరం భామల్లో సారా అలీ ఖాన్ డిఫరెంట్. సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకోవడంలో కూడా ఆమె దిట్ట. ఎప్పటికప్పుడు తన ఇన్స్టా ఖాతా ద్వారా తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.