PM Modi Samosa Caucus: అమెరికాలో.. మోదీ సమోసా పంచ్ అదిరింది

ప్రస్తుతం అమెరికాలో మోడీ పర్యటిస్తున్నారు. ఆయన రాక సందర్భంగా అమెరికా మొత్తం మోదీ నామస్మరణతో మార్మోగిపోతుంది. అక్కడి అధ్యక్షుడిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం మోడీ జపం చేస్తోంది.

Written By: Bhaskar, Updated On : June 24, 2023 10:53 am

PM Modi Samosa Caucus

Follow us on

PM Modi Samosa Caucus: వెనుకటికి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నప్పుడు వికటకవి తెనాలి రామకృష్ణుడు ఏదైనా ఒక పద్య పూరణం చేయాల్సి వచ్చినప్పుడు చాలా తెలివిగా వ్యవహరించేవారు. తినే వస్తువు ను దానికి అనువయించి చెప్పేవారు. గుమ్మడికాయ దగ్గర నుంచి కూరలో వేసుకునే ఉప్పు వరకు ప్రతి వస్తువును తన పురాణానికి వాడేవారు. దీనికి ముచ్చటపడి రాయలవారు ఆయనకు భరణాలు ఇచ్చేవారు. ఇప్పటికీ వికటకవి గురించి చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఆయనకు ఉన్న సమయస్ఫూర్తి. అలాంటి సమయస్ఫూర్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రదర్శించారు. అంతేకాదు వాక్చాతుర్యానికి అమెరికా ఉభయసభలు పగలబడినవ్వాయి. రెండు చేతులతో చప్పట్లు కొట్టి ఆయనను అభినందించాయి. అమెరికా ఉభయసభలను కేవలం మనం తినే సమోసాతో మోదీ పడేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే

ప్రస్తుతం అమెరికాలో మోడీ పర్యటిస్తున్నారు. ఆయన రాక సందర్భంగా అమెరికా మొత్తం మోదీ నామస్మరణతో మార్మోగిపోతుంది. అక్కడి అధ్యక్షుడిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం మోడీ జపం చేస్తోంది. మోడీ కూడా తక్కువ వాడా? తన మాటతీరుతో అమెరికన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాడు.. తాజాగా అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల్లో మోడీ మాట్లాడాడు. ” సమోసాలో ఆలూ ఉన్నంతవరకు.. బీహార్లో లాలు ఉంటాడు అని” వెనుకటి రోజుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పాడు. సరిగ్గా ఈ మాటలనే ప్రధానమంత్రి తనకు అనుకూలంగా చెప్పారు. “అమెరికా_ భారత్ మధ్య మైత్రి ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్ల సాంస్కృతిక వారసత్వం రెండు దేశాల మధ్య ఉంది. భారత్ సంతతికి చెందిన ప్రజలు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. మీరు ఈరోజు ఇక్కడి సమావేశంలో వచ్చిన అతిథులకు సమోసాలు పెట్టారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ” అంటూ మోడీ తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో ఉభయసభల్లో ఉన్నవారు మొత్తం ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. ఇక అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పగలబడి నవ్వారు. అంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కమలాహరిస్ ఇచ్చిన విందులో సమోసాలు పెట్టారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని మోదీ సమయోచితంగా సమోసాను గుర్తు చేసుకున్నారు.

అదే మాటను తిప్పి చెప్పారు

ఇక ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో అమెరికన్ జర్నలిస్టులు మీ వైఖరి చెప్పాలంటూ నరేంద్ర మోడీని పదేపదే అడిగారు. ఆ ప్రశ్నకు మోడీ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని, శాంతి మంత్రాన్ని జపిస్తుందని ఆయన వివరించారు. గతంలో కూడా తాము ఇదే మాట చెప్పామని, ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నామని మోడీ ప్రకటించారు. అమెరికన్ గడ్డ మీద అడుగు పెట్టిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడుతారు అనుకొని ఆ ప్రాంత జర్నలిస్టులు పదేపదే ప్రశ్నలు అడిగారు. కానీ వారి కంటే పది ఆకులు ఎక్కువ చదివిన మోడీ న్యూట్రల్ గానే మాట్లాడారు. మొత్తానికి ఏ భారత ప్రధానికి దక్కని గౌరవాన్ని నరేంద్ర మోడీ పొందారు. ఆ దేశ అధ్యక్షుడిని మించి అక్కడ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు.