https://oktelugu.com/

Laughing Buddha: ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఎటు వైపు ఉంచుకోవాలో తెలుసా?

లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలనే దానిపై అవగాహన ఉండాలి. దీన్ని ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచుకుంటే మంచిది. తూర్పు వైపున లాఫింగ్ బుద్ధ పెట్టడం మంచిది. పిల్లల స్టడీ రూంలో లాఫింగ్ బుద్ధుడి విగ్రహం పెడితే అది పిల్లల మనసుపై సానుకూలత కలుగుతుంది. పిల్లల మనసు ఏకాగ్రతతో ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 24, 2023 / 10:57 AM IST

    Laughing Buddha

    Follow us on

    Laughing Buddha: ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది అలంకార ప్రాయం కాదని దీంతో శుభాలు కలుగుతాయని నమ్ముతున్నారు. దీన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే సరైన దిశలో ఉంచుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఒకవేళ సరైన దిశలో లేకపోతే ఇబ్బందులు తప్పవు.

    జపాన్ నివాసి హోతాయ్ బౌద్ధ మతాన్ని అనుసరించాడు. హోతాయ్ తపస్సు చేయడం ద్వారా జ్ణానోదయం పొందాడు. అన్ని తెలుసుకున్నాక ఆయన బాగా నవ్వాడు. జీవితంలో ప్రజలను నవ్వించడానికి పని చేస్తానని నిర్ణయించుకున్నాడు. హోతాయ్ అనేక దేశాలు తిరిగాడు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు నవ్విస్తుండేవాడు. ప్రజల్లో ఆనందాన్ని నింపాలనుకున్నాడు. అందుకే ఆయనను లాఫింగ్ బుద్ధ అనే పేరు సంపాదించుకున్నారు.

    లాఫింగ్ బుద్ధను సంతోషానికి చిహ్నంగా చూస్తారు. లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ఇంట్లో ఆనందం, సంప వస్తుందని నమ్ముతుంటారు. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచుకోవాలని తాపత్రయపడుతుంటారు.

    లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలనే దానిపై అవగాహన ఉండాలి. దీన్ని ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచుకుంటే మంచిది. తూర్పు వైపున లాఫింగ్ బుద్ధ పెట్టడం మంచిది. పిల్లల స్టడీ రూంలో లాఫింగ్ బుద్ధుడి విగ్రహం పెడితే అది పిల్లల మనసుపై సానుకూలత కలుగుతుంది. పిల్లల మనసు ఏకాగ్రతతో ఉంటుంది.

    ఆఫీసు డెస్స్ మీద పెట్టుకుంటే ఏకాగ్రత వస్తుంది. తోటి వారితో సంబంధాలు బలపడతాయి. వ్యాపార స్థలాల్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే వ్యాపారం క్రమంగా పెరుగుతుంది. వాస్తు శాస్త్ర్రం ప్రకారం బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచుకుంటే చాలా మంచిది. ప్రతికూల శక్తులురాకుండా చేసుకోవచ్చు. బంగారు రంగులో ఉండే లాఫింగ్ బుద్ధ మరింత మంచి ఫలితాలు ఇస్తుంది.

    లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని నేలపై పెట్టుకోకూడదు. చీకటి ప్రదేశాల్లో పెట్టకూడదు. ఎలక్ర్టానిక్ వస్తువులతో పాటు ఉంచొద్దు. పూజ స్థానంలో ఉంచకూడదు. షూరాక్ మీద పెట్టకూడదు. ఇంటిప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టొద్దు.