https://oktelugu.com/

‘వేదాంతం రాఘవయ్య’ మొదలయ్యాడు !

హాస్యనటుడిగా తెలుగు చిత్ర సీమలో సూపర్ సక్సెస్ లో ఉన్న సునీల్ ‘అందాలరాముడి’తో కథానాయకుడిగా మారి మొదటి సినిమాతోనే విజయం అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడితో ద్వీతీయ విఘ్నం కూడా అద్భుత విజయంతో జయించాడు. ఆ ఊపులో కమెడియన్ వేషాలకు స్వస్తి పలికి హీరోగా మారి వరుస పెట్టి సినిమాలు చేసాడు. అయితే సక్సెస్ ని కొనసాగించలేక , హీరోగా అవకాశాలు సన్నగిల్లడంతో తన మిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అరవింద సమేత వీర […]

Written By:
  • admin
  • , Updated On : January 10, 2021 / 10:11 AM IST
    Follow us on


    హాస్యనటుడిగా తెలుగు చిత్ర సీమలో సూపర్ సక్సెస్ లో ఉన్న సునీల్ ‘అందాలరాముడి’తో కథానాయకుడిగా మారి మొదటి సినిమాతోనే విజయం అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడితో ద్వీతీయ విఘ్నం కూడా అద్భుత విజయంతో జయించాడు. ఆ ఊపులో కమెడియన్ వేషాలకు స్వస్తి పలికి హీరోగా మారి వరుస పెట్టి సినిమాలు చేసాడు. అయితే సక్సెస్ ని కొనసాగించలేక , హీరోగా అవకాశాలు సన్నగిల్లడంతో తన మిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీలో తిరిగి హాస్య పాత్రలో కనువిందు చేసాడు. ఆ తర్వాత పడి పడి లేచే మనసు, చిత్రలహరి మరియు అలా వైకుంఠపురములో వంటి చిత్రాలలో నటించి బ్యాక్ టూ ఫామ్ అనిపించుంకున్నాడు.

    Also Read: చరిత్ర సృష్టించిన కేజీఎఫ్2: 100 మిలియన్ వ్యూస్ దాటేశారు

    గత సంవత్సరంలో డిస్కో రాజా , కలర్ ఫోటో సినిమాలలో విలన్ గా ఉత్తమ ప్రదర్శన చేసి ప్రేక్షకులని అలరించాడు. అయితే మరల ఇప్పుడు రెండేళ్ల తర్వాత “వేదాంతం రాఘవయ్య” తో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమాకు సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ఆచంట‌, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమాకు క‌థ‌ అందించ‌డంతో పాటు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తున్నారు. ఈ ప్రాజెక్టును శనివారం పూజా వేడుకతో హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభించారు.

    Also Read: పిల్లలే పెళ్లి పెద్దలుగా సింగర్ సునీత పెళ్లి

    ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ క్లాప్ కొట్టి మొద‌టి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. నిర్మాత గోపి ఆచంట కెమెరా స్విచాన్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను రామ్ ఆచంట ద‌ర్శ‌కుడు సి.చంద్ర‌మోహ‌న్‌కు అందించారు. ఈ సినిమాకు సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. దాము న‌ర్రావుల సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకానుందని, నటీనటుల గురించి త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్