Petrol and Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి ధరల పెరుగుదలతో పరోక్షంగా నిత్యవరస వస్తువుల ధరలు కూడా పెరిగాయి. డీజిల్ ధర పెరుగుదలతో ఆటోమేటిక్‌గా చాలా ధరలు పెరుగుతాయి. కారణం రవాణ. మన నిత్యం ఉపయోగించే వస్తులు ఒక్క దగ్గర తయారై మరో దగ్గరికి రవాణా కావాల్సి ఉంటుంది. ఇది ప్రతీ రోజూ జరుగుతూ ఉంటుంది. మరి కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసే మిషన్లు పెట్రోల్, డిజీల్‌తో నడుస్తాయి. కాబట్టి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఆ వ్యయాన్ని వినియోగదారుడిపై వేయాలన్న భావనతో ఆటోమేటిక్‌గా ధరలను పెంచుతారు. ఇలా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది.

అంతర్జాతీయ మార్కెట్ లో తక్కువ.. మన దగ్గర ఎక్కువ..
అంతర్జాతీయ మార్కెట్ ధరల హెచ్చు తగ్గుదలతో మన దగ్గర కూడా పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా మన ఇండియాలో మాత్రం పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా సమయంలో ఒక సందర్భంలో ఉచితంగా ముడి చమురును తీసుకెళ్లాల్సిందిగా గల్ఫ్ కంట్రీస్ అన్ని దేశాలను రిక్వెస్ట్ చేశాయి. కానీ మన దగ్గర మాత్రం రేట్లు మండిపోతూనే ఉన్నాయి. ఈ విషయంలో చాలా రోజుల నుంచి సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అసలే కరోనా, లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అలాంటి సమయంలో ఈ పెట్రో ధరలు అధికంగా ఉండటం వల్ల చాలా రోజుల నుంచి ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు నిందించుకుంటున్నారే తప్పా.. సామాన్యుల కోణం నుంచి అస్సలు ఆలోచించడం లేదు.
ఎక్సైజ్ సుంఖం తగ్గించిన కేంద్రం..
ప్రజల నుంచి అసంతృప్తి ఎక్కువవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఒకే సారి పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. ఆయా రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని సూచించింది. దీంతో దేశ వ్యాప్తంగా ధరలు కొంత తగ్గాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచనలకు స్పందించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత కోత విధించుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించుకొని, ధరలను తగ్గించాయి.
Also Read: COP26: భూమి వినాశనంపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
అందుకేనా.. ?
పెట్రోల్, డీజీల్‌పై కేంద్ర ప్రభుత్వం ఒక్క సారిగా సుంఖాన్ని తగ్గించడం వెనక కారణాలేంటి అనే కోణంలో చాలా విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. కొన్ని నెలల్లో దాదాపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్దిపొందేందుకు బీజేపీ ఇలా ట్యాక్స్ తగ్గించిందని తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అధిక స్థానాలు గెలవడం బీజేపీకి చాలా ముఖ్యం. అక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిస్తేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడానికి వీలవుతుంది. ఈ సారి ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి విజయం అత్యవసరం. అందుకే ఆ రాష్ట్రాలు కూడా కేంద్రం సూచనతో వ్యాట్ ను తగ్గించాయి. ధరలను 100కి తగ్గించేలా మార్పులు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా అలానే జరిగింది. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగవచ్చని, ఎన్నికల కోసం ఈ తగ్గింపు అని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: BJP In Telangana : తెలంగాణలో బీజేపీ అతివిశ్వాసం కొంప ముంచుతుందా?