భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు బొగ్గు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల కరెంట్ ఉత్పత్తికి దీనినే వాడుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, చైనా తరువాత భారత్ ఉంది. ఇంధన వాడకంలో 70 శాతం బొగ్గును ఉపయోగించుకుంటున్న భారత్ లో ఇటీవల విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. అందుకు బొగ్గు నిల్వలు లేకపోవడమే కారణమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగానే కోతలు ఉంటాయని ప్రకటించింది. అయితే ఇండియాలో బొగ్గు నిల్వలు తగ్గడానికి కారణం ఏంటి..? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది..?

1774లో ఈస్ట్ ఇండియా కంపెనీ నారాయణకుడి ప్రాంతంలో బొగ్గు నిల్వలను కనుగొన్నారు. ఆ తరువాత 1853 లో రైలు నడపడంలో బొగ్గును వినియోగించారు. దశాబ్దం తరువాత పారిశ్రామికీకరణతో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 20 శతాబ్దం ప్రారంభంలో సంవత్సరానికి 61 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఏర్పడింది. అంతేకాకుండా వివిధ అవసరాలకు బొగ్గును వినియోగిస్తున్నారు. 1973లో బొగ్గు గనులను జాతీయ చేసినప్పటి నుంచి ప్రభుత్వ సంస్థలే బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో కోల్ ఇండియా సంస్థ మొదటి స్థానంలో ఉంది.
ఇండియాలో 31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ఇటీవల బొగ్గు గనుల శాఖ తెలిపింది. దేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రాలో జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గడ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో ఉన్నాయి. వీటన్నింటిని కలిపి కోల్ బెల్ట్ అని పిలుస్తారు. బొగ్గు గనులను ఇతర కంపెనీలకు కూడా ఇచ్చారు. వాటిని క్యాస్టిన్ మైన్స్ అంటారు. అయితే ఇవి ఉత్పత్తి చేసే నిల్వలు సొంత అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు.
సాధారణంగా అక్టోబర్ నెలలో బొగ్గుకు డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి అక్టోబర్లో కరోనా కారణాల వల్ల థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కాలేదు. దీంతో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించింది. మరోవైపు 2019 ఆగస్టుతో పోలిస్తే 2021లో విద్యుత్ వినియోగం 16 శాతం పెరిగింది. దీంతో బొగ్గు ఉత్పత్తిని అంచనా వేయడంతో కోల్ ఇండియా విఫలమైందని నిపుణులు అంటున్నారు. ఇక భారీ వర్షాలు కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
దేశంలోని చాలా రాష్ట్రాలు విద్యుత్ కొరత ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 73,000 కోట్ల నిధులు అవసరమని చెబుతోంది. విద్యుత్ ను జాగ్రత్తగా వాడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు సంక్షేమాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు సహకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. కానీ బొగ్గు సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం 31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి తెలిపారు. ఇది దేశ అవసరాలకు సరిపోతుందని అంటున్నారు.