టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ ఈనెల 15న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి క్షేమంగా ఇంటికి వచ్చాడు. గత నెల 10న ఈ హీరో బైక్ పై వస్తుండగా హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ స్కిడ్ కావవడంతో సాయి కోమాల్లోకి వెళ్లిపోయాడు. అక్కడున్నవారు అతన్ని ఆసుపత్రిలో చేర్పించేంత వరకు అతడు సినీ నటుడు అని ఎవరికి తెలియలేదు. కానీ స్థానికులు అతన్ని అత్యంత వేగంగా ఆసుపత్రికి చేర్పించడంతో పెద్ద ప్రమాదమే తప్పందటున్నారు.

అయితే ఆసుపత్రిలో చేరినా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆందోళనే వ్యక్తమయింది. ఆయన ఆరోగ్యంపై అప్పుడే చెప్పలేమని ఆ సమయంలో వైద్యులు తెలిపారు. అయితే బులిటెన్ వైజ్ గా ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. మొత్తంగా 36 రోజులు సాయి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ తరుణంలో సాయి ఆసుపత్రి బిల్లు ఎంతైంది..? అన్న చర్చ సాగుతోంది.
సాధారణ వ్యక్తులు ఒకటి, రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందితే లక్షల్లో బిల్లు పే చేయాల్సి ఉంటుంది. అయితే 36 రోజుల పాటు సాయి ఆసుపత్రిలో ఉండడంతో ఆయన బిల్లుపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఆసుపత్రి మెగా ఫ్యామిలీకి చెందినదే. మరి సాయి చికిత్సకు బిల్లు పే చేయలేదా..? అంటే అదేం లేదంటున్నారు. కానీ ఆయన చికిత్సకు మాత్రం భారీగా బిల్లు అయినట్లు తెలుస్తోంది.
ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సాయి ఆరోగ్యం గురించి వైద్యులు చెప్పడమే గానీ.. ఆయన ఫొటో లేదా వీడియోను ఎవరూ తీయలేదు. ఈ విషయంలో కొంచెం గోప్యత పాటించారు. చికిత్స పూర్తయిన తరువాతను తాను సేఫ్ అంటూ సాయి విజయసంకేతంగా హ్యాండ్ ను మాత్రమే చూపించారు. కానీ ఫేస్ ను చూపించలేదు. అలాగే ఆయన చికిత్స బిల్లు వివరాలు కూడా బయటికి రానివ్వడం లేదు. దీంతో సాయి 36 రోజుల పాటు ఎంత బిల్లు చెల్లించారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అలాంటిది మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ఇన్సూరెన్స్ తీసుకోరా..? అని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. సాయికి భారీగానే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని దాని ప్రకారమే ఆయన బిల్లు పే చేశారని అంటున్నారు. కానీ ఆ విషయం కూడా బయటకు పొక్కడం లేదు. ఏదీ ఏమైనా ఆయన బర్త్ డే సందర్భంగా సాయి క్షేమంగా ఇంటికి రావడం అందరికీ సంతోషాన్నిచ్చింది. త్వరలో సాయి మళ్లీ వెండితెరపై కనిపిస్తాడని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా పోస్టు పెట్టాడు.