రఘురామ పేరు తొలగింపులో ఆంతర్యమేమిటి?

ముఖ్యమంత్రి జగన్ సహా సొంత పార్టీపైనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏడాదిన్నరగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల రాజద్రోహం కేసులో బెయిల్ పై విడుదలై వచ్చిన తరువాత ఎంపీ తన విమర్శలకు మరింత పదునుపెంచారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్పీ అధికార వెబ్ సైట్ లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామ పేరును తొలగించారు. రాజ్యసభ, లోక్ సభ కలిపి ఆ పార్టీ తరఫున 28 మంది పార్లమెంట్ సభ్యుల పేర్లను గతంలో […]

Written By: Srinivas, Updated On : June 13, 2021 12:05 pm
Follow us on

ముఖ్యమంత్రి జగన్ సహా సొంత పార్టీపైనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏడాదిన్నరగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల రాజద్రోహం కేసులో బెయిల్ పై విడుదలై వచ్చిన తరువాత ఎంపీ తన విమర్శలకు మరింత పదునుపెంచారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్పీ అధికార వెబ్ సైట్ లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామ పేరును తొలగించారు. రాజ్యసభ, లోక్ సభ కలిపి ఆ పార్టీ తరఫున 28 మంది పార్లమెంట్ సభ్యుల పేర్లను గతంలో పొందుపరిచారు. ఇటీవల తిరుపతి నుంచి విజయం సాధించిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు.

రఘురామ పేరు మాత్రం సవరించిన జాబితాలో లేదు.దీనిపై అధికార పార్టీ నేతలు ఎవరు ఇంకా స్పందించలేదు. వైఎస్సార్ సీపీ అధికార వెబ్ సైట్ లో ఎంపీల జాబితాలో తన పేరు లేకపోవడంపై రఘురామ స్పందించారు. ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడ నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా?అని ప్రశ్నించారు. అంతేకాదు తన పార్లమెంట్ సభ్యత్వ అనర్హత అంశంపై తలెత్తబోతోందని పునరుద్ఘాటించారు.

ప్రభుత్వ సంక్షేమ ఫలితాల అమలులో లోపాలను మాత్రమే ఎత్తి చూపానని, తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదన్నారు. తాను కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేశానని, వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయన్నారు. తనపై దాడి చేసిన విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. తనపై అనర్హత వేు వేయాలని ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన వైఎస్సార్ కానుక, షాదీముబారక్ హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి జగన్ కు సూచించానని రఘురామ తెలిపారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి శనివారం మరో లేఖ రాశారు. గత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, దుల్హన్ పేరుతో పేద కుటుంబాల్లోని యువతుల వివాహాలకు రూ.50 వేలు అందజేసిందని పేర్కొన్నారు అధికారంలోకి వస్తే మొత్తాన్ని మనం రూ.లక్షకు పెంచుతామని హామీ ఇచ్చామని గుర్తు చేశాు. వీటికి నిధులు విడుద చేయాలని కోరానని పేర్కొన్నారు.