
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కలికట్టుగా వైరస్ ను అంతమొందించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రతిష్టాత్మకమైన జీ 7 వర్చువల్ సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఇందులో దేశ రాజధాని ఢిల్లీ నుంచి మోడీ పాల్గొన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కౌట్ మోరిస్, ఫ్రెండ్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ ఈ సదస్సులో వర్చువల్ ద్వారా పాల్గొన్నారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్.. కాన్సెప్ట్ తో అన్ని దేశాలు సంక్షోభాన్ని అధిగమించాలని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ -హెల్త్ అనే అంశంపై ప్రసంగించారు.
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంతో డిజిటల్ సేవలను ఎంతో ఉపయోగించుకోగలిగామన్నారు. మేధో సంపత్తి హక్కుల వినియోగంపై ఉన్న ఆంక్షలను తొలగించడానికి జీ 7 దేశాలు అంగీకరించాలని కోరారు. ప్రత్యేకించి కరోనా వైరస్ సాంకేతిక పరిజ్ఒాణంపై ట్రిప్స్ ను తొలగించడానికి తమ సపోర్టు ఉంటుందన్నారు. ఇక కరోనా ను తరిమి కొట్టడంతో వ్యాక్సిన్ కీలకంగా మారిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వైరస్ వచ్చినా దానిని ఎదుర్కోడానికి సమష్టి కృషి అవసరం అన్నారు.
గత కరోనా సమయంలో వైరస్ ను ఎదుర్కోవడంలో అన్ని దేశాలు సమష్టిగా కృషి చేశాయని, భారత్ సంక్షోభ సమయంలో జీ 7 దేశాలు ఆపన్నహస్తం అందించాయన్నారు. భారత్ ను ఈ దేశాలు అన్ని విధాలుగా ఆదుకోవడంతో జీ 7 దేశాలు ఐక్యంగా ఉన్నాయని చాటి చెప్పినట్లయిందన్నారు. కష్ట సమయంలో ఒకరికొకరు ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని చెప్పారు. ఇతరులు చేసిన సాయాన్ని మర్చిపోలేని గుణం భారతీయుల్లో ఉందన్నారు.