భారత్ లో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతంటే..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో ఆందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాని ధర ఎంత ఉంటుందనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. తెలుస్తున్న సమాచారం ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి […]

Written By: Navya, Updated On : October 31, 2020 7:33 pm
Follow us on


భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో ఆందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాని ధర ఎంత ఉంటుందనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.

తెలుస్తున్న సమాచారం ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ఉచితంగా వ్యాక్సిన్ ను అందించాలని భావిస్తోంది. అయితే అంచనాల ప్రకారం సింగిల్ డోస్ వ్యాక్సిన్ అయితే దాని ఖరీదు 2,700 రూపాయలు ఉండవచ్చని, డబుల్ డోస్ వ్యాక్సిన్ అయితే దాని ఖరీదు 450 రూపాయల నుంచి 5,500 రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ఎన్నో కంపెనీలు ప్రయోగాలను మొదలుపెట్టగా కేవలం పది వ్యాక్సిన్లు మాత్రమే చివరిదశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకున్నాయి. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ తొలుత తమ దేశానికే పంపిణీ చేసే విధంగా పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రెండు డోసులు అవసరమని.. దేశంలో 50 శాతానికి పైగా ప్రజలకు వ్యాక్సిన్ అవసరం ఉండవచ్చని తెలుపుతున్నారు.

అయితే కేంద్రం ఉచితంగానే ప్రజలకు వ్యాక్సిన్ ను ఇస్తామని చెబుతున్నా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఉచితంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేయడం సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.