అదృష్టవంతుణ్ణి ఎవరూ చెడగొట్టలేరు..దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరు. ఈ సామెత టీడీపీ కాపు నేత వంగవీటి రాధాకు బాగా వర్తిస్తుంది.రాజకీయ దురదృష్టవంతులలో ఈయన మొదటివరసలో ఉంటారు. చూసినంత సేపు చూసి… వడ్డించే ముందు పక్క బంతిలోకి వెళ్లి అక్కడ ఎదురు చూసే రకం. కాపు సామాజిక వర్గం ఆరాధించే వంగవీటి రంగా కొడుకుగా విజయవాడలో ఆయన దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. తన తండ్రి చావుకు కారణం టీడీపీ నేతలే అని గట్టిగా నమ్మే వంగవీటి రాధా, ఎప్పటి నుండో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇతర పార్టీలలో కొనసాగారు.
ముద్రగడ.. కాపులు.. ఓ కుట్రకోణం!
2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా కెరీర్ గాడినపడుతున్న క్రమంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జెస్ట్ స్పీడ్ తో దూసుకెళుతున్న కాంగ్రెస్ పార్టీ వీడి, అప్పుడే పురుడుపోసుకున్న పీఆర్పీలో చేరారు. 2009 ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుండి పీఆర్పీ తరుపున పోటీచేసి అపజయం పొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు, రాధా పై విజయం సాధించడం జరిగింది. పీఆర్పీ పార్టీ నుండి వైసీపీ పార్టీలో చేరిన వంగవీటి రాధా, 2014ఎన్నికలలో అదే నియోజక వర్గంలో పోటీచేసి ఓటమిపాలయ్యారు.
ఇక ఐదేళ్లు మాజీ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీలో ఉన్న రాధా, సరిగ్గా 2019ఎన్నికలకు ముందు జగన్ పై వ్యతిరేక జెండా ఎగరవేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు వైసీపీ తరుపున మల్లాది విష్ణుకు కేటాయిస్తున్నారని తెలుసుకొని, ఆ సీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన అనుచరుతో నిరసన కార్యక్రమాలు కూడా చేయించారు. దానికి బదులుగా మచిలీపట్టణం ఎంపీ సీటు ఇస్తానని చెప్పినా, ఆయన విజయవాడ సెంట్రల్ సీటు కోసం పట్టుబట్టుకు కూర్చున్నారు. జగన్ ససేమిరా అనడంతో వైసీపీని వీడి, టీడీపీలో చేరారు. పచ్చ కండువా కప్పున వెంటనే… జగన్ అహంకారి అని, ఎవరి మాటా వినడని, తనకు పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. ధారుణంగా బాబుకి మరియు టీడీపీకి రంగా చావుతో సంబంధం లేదని చెప్పి ఆశ్చర్య పరిచారు.
జగన్ ముందు బాలయ్య డిమాండ్ల చిట్టా..!
తీరా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అయన గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎదో కాపు ఓటు బ్యాంకు కోసం బాబు, రాధాను చేరదీసినా పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం 2019ఎన్నికలలో అతనికి ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటు కానీ ఇవ్వలేదు. రాధాను చేరదీయడం వలన టీడీపీకి ఒరిగింది ఏమీ లేదని ఎన్నికల తరువాత కాపు ఓట్ల సమీకరణాలు చూసి అర్థం చేసుకున్నారు. దీనితో టీడీపీలో ఆయనకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాధా అసలు టీడీపీలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎటువంటి ప్రాధాన్యం లేకుండా టీడీపీలో ఉండడం అనవసరం అనుకుంటున్న రాధా, వేరే పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారట. టీడీపీ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉండగా, ఆయన జనసేన లేదా వైసీపీ పార్టీలో చేరేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ఎక్కువ శాతం ఆయన చూపు వైసీపీ వైపు ఉన్నట్లు సమాచారం.