https://oktelugu.com/

రానా, అల్లరి నరేష్‌ మల్టీస్టారర్ వెబ్‌ సిరీస్‌?

దగ్గుబాటి రానా, అల్లరి నరేశ్. ఇద్దరూ సినీ వారసులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటులు. దిగ్గజ నిర్మాత, దివంగత రామానాయుడు మనవడిగా తెరంగేట్రం చేసిన రానా తొలుత హీరోగా చేసినా తర్వాత ఇమేజ్‌ను పక్కనపెట్టి సపోర్ట్‌ యాక్టర్ గా, విలన్‌గా కూడా వరుస చిత్రాలు చేశాడు. తెలుగులోనే కాకుండా తమిళ్‌, హిందీలో నటిస్తూ దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’లో భల్లాలదేవగా అతని విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక్కసారిగా నేషనల్‌ స్టార్గా మారిపోయాడు. మరోవైపు దివంగత […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 14, 2020 / 05:04 PM IST
    Follow us on


    దగ్గుబాటి రానా, అల్లరి నరేశ్. ఇద్దరూ సినీ వారసులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటులు. దిగ్గజ నిర్మాత, దివంగత రామానాయుడు మనవడిగా తెరంగేట్రం చేసిన రానా తొలుత హీరోగా చేసినా తర్వాత ఇమేజ్‌ను పక్కనపెట్టి సపోర్ట్‌ యాక్టర్ గా, విలన్‌గా కూడా వరుస చిత్రాలు చేశాడు. తెలుగులోనే కాకుండా తమిళ్‌, హిందీలో నటిస్తూ దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’లో భల్లాలదేవగా అతని విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక్కసారిగా నేషనల్‌ స్టార్గా మారిపోయాడు. మరోవైపు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తన తొలి సినిమా ‘అల్లరి’నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు నరేశ్‌. పూర్తి స్థాయి కామెడీ హీరోగా వరుస సినిమాలు చేసిన అతను హిట్టుకంటే ఫ్లాపులో ఎక్కువ ఖాతాలో వేసుకున్నాడు. ‘గమ్యం’తో కామెడీ ఉన్న కీలక క్యారెక్టర్తో రూటు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ, తిరిగి పాత తరహా మూవీలే చేసి ఫేడ్‌ ఔట్‌ అయ్యాడు. ఇలాంటి టైమ్‌లో ‘మహర్షి’లో సీరియస్‌ క్యారెక్టర్తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్చేశాడు. ఇప్పుడతను ‘నాంది’ మరో డిఫరెంట్‌ మూవీతో ముందుకొస్తున్నాడు. ఇందులో అన్యాయంగా ఖైదు చేయబడ్డ యువకుడి పాత్రలో నరేష్‌ నటిస్తున్నాడు. పోలీస్‌ స్టేషన్‌లో నగ్నంగా చిత్రహింసలు పెడుతున్న సన్నివేశాలతో కూడిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అలాగే, ‘బంగారు బుల్లోడు’ సినిమా కూడా చేస్తున్నాడు.

    వెబ్‌ బాటలోకి మరో స్టార్ డైరెక్టర్?

    మరోవైపు రానా.. నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘విరాట పర్వం’ అనే మూవీ చేస్తున్నాడు. నరేష్‌, రానా ఇద్దరూ ఇదివరకు చాలా మల్టీస్టారర్స్‌ మూవీలు చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నారట. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓ వెబ్‌ సిరీస్‌ అని సమాచారం. ఓ ప్రముఖ సంస్థ దీన్ని రూపొందిస్తుందని.. ఇప్పటికే కథ పూర్తవగా, నటీ నటుల ఎంపిక కూడా పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టులు ముగిసిన వెంటనే రానా, నరేశ్‌ ఈ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం ఉంది.