సిరిసిల్లలో కాంగ్రెస్ నేతల సైలెంట్ వెనుక మర్మమేమిటి?

ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న జిల్లా సిరిసిల్ల. కేటీఆర్ తొలి నుంచి ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ టీఆర్ఎస్ జెండాను రెపరెపలాడిస్తున్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గం ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన సంగతి తెల్సిందే. సిరిసిల్లకు జిల్లాకు కావాల్సిన అర్హతలు లేనప్పటికీ కేటీఆర్ పట్టుదలతో సిరిసిల్లా ప్రత్యేక జిల్లా ఏర్పాటైందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతుంటాయి. తొలి వాక్సిన్ భారత్ […]

Written By: Neelambaram, Updated On : July 6, 2020 8:46 pm
Follow us on


ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న జిల్లా సిరిసిల్ల. కేటీఆర్ తొలి నుంచి ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ టీఆర్ఎస్ జెండాను రెపరెపలాడిస్తున్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గం ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన సంగతి తెల్సిందే. సిరిసిల్లకు జిల్లాకు కావాల్సిన అర్హతలు లేనప్పటికీ కేటీఆర్ పట్టుదలతో సిరిసిల్లా ప్రత్యేక జిల్లా ఏర్పాటైందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతుంటాయి.

తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్న కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యేది. కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ ప్రతీసారి గట్టి పోటీనిచ్చేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ తొలిసారి సిరిసిల్లలో పోటీచేసినపుడు కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి బలమైన పోటీ ఇచ్చారు. కేవలం వందల ఓట్లతో కేకే ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి కేటీఆర్ పై పోటీ చేస్తూ గెలిచే అవకాశం కోసం చూస్తూనే ఉన్నారు. ప్రతీసారి ఆయనకు ఓటమి తప్పడం లేదు. అయినప్పటికీ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే కేసీఆర్ తనయుడిని ఓడించే అవశాలున్నాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

ఈ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న కేకే మహేందర్ రెడ్డి కొంతకాలంగా సైలంట్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమాలు ఇక్కడ పెద్దగా కన్పించడం లేదని సమాచారం. సిరిసిల్లలో కాంగ్రెస్ రెండువర్గాలుగా విడిపోయిందనే వాదనలు విన్పిస్తున్నాయి. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వైపు ఒకవర్గం, కేకే మహేందర్ రెడ్డిది మరో వర్గంగా ఉందట. వీరిద్దరి మధ్య విభేదాలు ఇటీవల జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో బయటపడుతున్నాయట. కేకే మహేందర్ రెడ్డిని పొన్నం వర్గం దూరం పెట్టడంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని కేకే అనుచరగణం ఆరోపిస్తోంది. దీంతో తన అనుచరవర్గంతో మీడియా సమావేశాలు సైతం జిల్లా కేంద్రంలోనే కేకే పెడుతున్నారని కిందిస్థాయి నేతలు చెబుతోన్నారు.

ఇళ్ల స్థలాల పంపిణీకి వాయిదాకు కారణం ఇదేనా..!

సిరిసిల్లలో కేకే మహేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇంతకముందుగా పాల్గొనకపోవడంతో గులాబీ శ్రేణులు మరోరకంగా ప్రచారం చేస్తున్నాయి. కేటీఆర్ కు నియోజకవర్గంలో పోటీలేకుండా కాంగ్రెస్ నేత త్వరలోనే కారెక్కనున్నారని ప్రచారం చేస్తున్నాయి. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓటమిపాలైన ఒంటేరు ప్రతాపరెడ్డి చివరకు అదే పార్టీలో చేరారని గుర్తుచేశారు. ఆయనలాగే కేకే మహేందర్ కూడా త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటారని చర్చ నడుస్తోంది. రానున్న రోజుల్లో కేటీఆర్ కు పోటీలేకుండా కేకే మహేందర్ ను అధికార పార్టీ ఆకర్షిస్తోందనే వాదనలు విన్పిస్తున్నాయి. అందుకే కేకే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుగా కేకే మహేందర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ హ్యండిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!