విజయ్ దేవరకొండ తండ్రి.. బాలీవుడ్ హీరో !

డేరింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. పూరితో సినిమా చేయడానికి బాలయ్య లాంటి హీరోలు వెయిటింగ్ లో ఉన్నా.. పూరి మాత్రం ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తోన్నాడు. ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా బాలీవుడ్ మాజీ హీరో సునీల్ షెట్టి కనిపించబోతున్నాడట. తొలి వాక్సిన్ భారత్ నుంచే […]

Written By: admin, Updated On : July 6, 2020 5:55 pm
Follow us on


డేరింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. పూరితో సినిమా చేయడానికి బాలయ్య లాంటి హీరోలు వెయిటింగ్ లో ఉన్నా.. పూరి మాత్రం ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తోన్నాడు. ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా బాలీవుడ్ మాజీ హీరో సునీల్ షెట్టి కనిపించబోతున్నాడట.

తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

అయితే విజయ్ దేవరకొండ డాన్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడట. చాల భాగం డాన్ కి వ్యతిరేకంగా పని చేస్తుంటాడట. మరి ఈ తండ్రికొడుకుల ఎమోషన్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే షూట్ రెడీ అవుతొంది ఫైటర్ టీమ్. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 16 నుండి మొదలుకానుందని, ఆ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై సాంగ్స్ తీయనున్నారని తెలుస్తోంది.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

ఇక లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడని.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడని తెలుస్తోంది. బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఫైటర్ రూపంలో ఆ అవకాశం వచ్చింది. అందుకే ఈ సినిమా కోసం బాగా కష్ట పడుతున్నాడు. మరి విజయ్ దేవరకొండకు ఫైటర్ ఏ రేంజ్ లో కలిసొస్తోందో చూడాలి.