సీఎం సార్.. బయటికి రండి..!

కరోనా భయమో..? అనారోగ్య కారణమో..? తెలియదు గానీ తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. తెలంగాణలో లాక్ డౌన్ విధించిన తొలి రోజుల్లో ప్రతి రోజు మీడియా ముందుకొచ్చి ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించేవారు. తర్వాత తర్వాత మీడియా ముందుకు రావడం తగ్గించారు. గత 10 రోజుల నుండి కనీసం జాడలేకపోవడం గమనార్హం. తానే డాక్ట‌ర్‌ లా మారి క‌రోనా ఆరోగ్యరహస్యాలు చెబుతూ తెగ హల్ చల్ చేసిన కేసీఆర్ ఇప్పుడు […]

Written By: Neelambaram, Updated On : August 3, 2020 1:12 pm
Follow us on

కరోనా భయమో..? అనారోగ్య కారణమో..? తెలియదు గానీ తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. తెలంగాణలో లాక్ డౌన్ విధించిన తొలి రోజుల్లో ప్రతి రోజు మీడియా ముందుకొచ్చి ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించేవారు. తర్వాత తర్వాత మీడియా ముందుకు రావడం తగ్గించారు. గత 10 రోజుల నుండి కనీసం జాడలేకపోవడం గమనార్హం. తానే డాక్ట‌ర్‌ లా మారి క‌రోనా ఆరోగ్యరహస్యాలు చెబుతూ తెగ హల్ చల్ చేసిన కేసీఆర్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు, వినిపించ‌డం లేద‌ని జ‌నం తెగ‌బాధ‌ప‌డిపోతున్నారు. అప్ప‌ట్లో ప్రెస్‌ మీట్‌ లు పెట్టి ధైర్యం చెప్పిన కేసీఆర్ లాక్‌ డౌన్ ఎత్తేసి ఈ క‌ష్ట‌కాలంలో కనిపించకుండా పోయారన్న టాక్ బాగా నడుస్తోంది. ఆయన ప్రెస్ మీట్లు లేవు.. కరోనా పై తెలంగాణలో చర్యలు లేవంటున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ గురించి అందరూ ఆరాతీస్తున్నారు.

తెలంగాణలో కరోనా జెట్ స్పీడుగా పెరుగుతోంది. హోంమంత్రి మహమూద్ అలీకి, కొంత మంది శాస‌న‌స‌భ్యుల‌కు కరోనా సోకింది.  సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లోనూ పలువురికి కరోనా సోకింది. ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ కు మకాం మార్చారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ చూపు లేక ఇప్పుడు నెటిజన్లు మీడియా ఆయన కోసం తెగ కామెంట్స్ పెడుతున్నారు.

తమకు కరోనా వచ్చిందనే వార్తల్ని చాలామంది రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు, ఇంకొందరు అంగీకరిస్తూ సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తూ.. ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ ఈ రెండు చేయలేదు. అందుకే సీఎం కేసీఆర్ ఒక్కసారి బయటకు అందరికి కనిపించాలని వచ్చి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.