పవన్ మాటల్లో ఆంతర్యమేమిటో?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పార్టీపై పట్టు ఉన్నట్లు లేదు. మాటలపై అవగాహన లేదు. దీంతో ప్రతి సమావేశంలో కార్యకర్తలను నిరుత్సాహ పరిచే విధంగా మాట్లాడుతూ తనకు రాజకీయాలపై ఏమాత్రం వైఖరి లేదని నిరూపించుకుంటున్నారు. తాజాగా అమరావతి వచ్చిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను పదవుల కోసం రాలేదని చెప్పడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం కనిపించింది. పవన్ కల్యాణ్ మాటల్లో నిజాయితీ ఉందా అనిపిస్తోంది. అమరావతిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. వారికి పలు రకాలుగా అవగాహన […]

Written By: Srinivas, Updated On : July 8, 2021 6:53 pm
Follow us on

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పార్టీపై పట్టు ఉన్నట్లు లేదు. మాటలపై అవగాహన లేదు. దీంతో ప్రతి సమావేశంలో కార్యకర్తలను నిరుత్సాహ పరిచే విధంగా మాట్లాడుతూ తనకు రాజకీయాలపై ఏమాత్రం వైఖరి లేదని నిరూపించుకుంటున్నారు. తాజాగా అమరావతి వచ్చిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను పదవుల కోసం రాలేదని చెప్పడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం కనిపించింది. పవన్ కల్యాణ్ మాటల్లో నిజాయితీ ఉందా అనిపిస్తోంది.

అమరావతిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. వారికి పలు రకాలుగా అవగాహన కల్పించారు. అధికారం కోసమే అయితే తాను ఏ పార్టీలోకి వెళ్లినా తనకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడాలని సూచించారు. పవన్ కల్యాణ్ మాటల్లో మొహమాటం కనిపించింది. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోసమే వస్తుందని కార్యకర్తలకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాసేవ చేయాలనుకుంటే ఏ స్వచ్ఛంద సంస్థ పెట్టుకోవాలే కాని ఇలా రాజకీయ పార్టీ పెట్టి సేవ చేస్తామని చెప్పడమేమిటని చర్చించుకుంటున్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించారు. కానీ తానే ముఖ్యమంత్రి అని ఏనాడు చెప్పలేదు. అదే రాజకీయం. కానీ పవన్ కల్యాణ్ మాత్రం సూటిగా చెప్పలేక కార్యకర్తల్లో నూతనోత్సాహం పెంచలేకపోతున్నారు. దీంతో కార్యకర్తల్లో నైరాశ్యం పెరుగుతోంది.

జనసేనకు రాజ్యాధికారమే లక్ష్యం కాదు. గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదు అని చెప్పడంలో ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఇంతకీ పవన్ మాటలకు నిర్వచనమేమిటో తెలియడం లేదు. కార్యకర్తల మనసులు బాధపడేలా డైలాగ్స్ పేల్చడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాత్మకమో లేక అమాయత్వమో అర్థం కావడం లేదని పలువురు కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు.